డార్లింగ్ ప్రభాస్ తన సిల్వర్ జూబ్లీ చిత్రం చేయబోతున్నాడు. దీనికి దర్శకుడుగా సందీప్ రెడ్డి వంగా ఖరారయ్యాడు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. టిసిరీస్ భద్రకాళి పిక్చర్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తాయి. అయితే.. దీనికి ‘స్పిరిట్’ అనేటైటిల్ పెట్టడాన్ని గమనిస్తే.. అర్జున్ రెడ్డి తరహా.. ఎక్సెంట్రిక్ వాసన ఉంటుందని అభిమానులు అనుకుంటున్నారు.
గత కొన్ని రోజులుగా రెబల్ స్టార్ ప్రభాస్ 25వ సినిమా గురించి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పుడు దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. రెబల్ స్టార్ ప్రభాస్ తన 25వ సినిమాను పాన్ ఇండియన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయబోతున్నారు. దీనికి ‘స్పిరిట్’ అనే ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేశారు.
అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి.. ఆ తర్వాత అదే సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశారు. అక్కడకూడా సంచలన విజయం అందుకున్నారు. ఇప్పటి వరకు రెబెల్ స్టార్ ప్రభాస్‌ను అభిమానులు కనీసం ఊహించనటువంటి కొత్త పాత్రలో సందీప్ రెడ్డి వంగా చూపించబోతున్నారు.
టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మాతగా పాన్ ఇండియన్ స్థాయిలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రాబోతుంది. టి సిరీస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్లు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.
ఇవి కూడా చదవండి :
పవర్ స్టార్ పవన్ = గ్యాంగ్‌స్టర్ నయీమ్.. ఎలాగో తెలుసా?
అభిమానులు ఊహించని స్టెప్ వేసిన జనసేనాని
satire : అర్ధరాత్రి గునపం దరువులు
ప్రజల్లో లోపమే.. ఇష్టారీతిగా ధరల పెంపుదలకు కారణమా?
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?
.

Discussion about this post