అమరావతి రైతుల పాదయాత్రలో శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మరియు రాష్ట్రఅధికార ప్రతినిధి డాక్టర్ .ఎస్. బతైయ్య నాయుడు పాల్గొన్నారు.
అమరావతి రైతుల పాదయాత్ర ఈరోజు శ్రీకాళహస్తి పట్టణం నందు జరిగినది.
ఈ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు రాగానే కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ .ఎస్. బతైయ్య నాయుడు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికి పాదయాత్రలో పాల్గొన్నారు.
అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండ్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తున్నదని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్కే. జానీ భాష, బీవి.శేఖర్, ఎస్ .నా గురయ్యా ,వడివేలు, భానమ్మ, సురేష్ ,ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
.