నెల్లూరు నగరంలో ఈ నెల 6వ తేదీ ఆదివారం నిర్వహించే నారీ సంకల్ప దీక్షకు మహిళలందరూ తరలి రావాలని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటరీ మహిళా విభాగం అధ్యక్షురాలు చక్రాల ఉష పిలుపు నిచ్చారు.
ఈ మేరకు ఆమె ఆదివారం శ్రీకాళహస్తిలో విలేకరులతో మాట్లాడారు. వైసీపీ అధికారమంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగి పోయాయని ఆమె ఆరోపించారు.
స్త్రీల ఆత్మగౌరవాన్ని అడుగడుగునా భంగపరుస్తున్న జగన్ రెడ్డి పాలనను నిరసిస్తూ… తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని అనిల్ గార్డెన్స్ నందు నారీసంకల్పదీక్ష చేస్తున్నట్లు చెప్పారు.
ఈ దీక్షకు మహిళలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. మహిళా ద్రోహి జగన్ రెడ్డి పాలనకు చరమగీతం పాడాలన్నారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్న తెలుగు మహిళా కమిటీ సభ్యులు, మహిళా నాయకులు అందరూ కూడా తప్పనిసరిగా నారీసంకల్పదీక్ష లో పాల్గొని దీక్షను విజయవంతం చేయవలసిందిగా కోరారు.
నారీ సంకల్ప దీక్ష విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి తెలుగు మహిళ తీసుకోవాలని చక్రాల ఉష విజ్ఞప్తి చేశారు.
.