తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రజలకు నిజంగా ఉపయోగపడే మంచి పరిపాలన అందిస్తున్నాడని పేరు తెచ్చుకున్నారు. కరుణానిధి కొడుకుగా డీఎంకే కీలకనాయకుడిగా ఎంతోకాలంనుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ.. ఇన్నాళ్లకు ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన స్టాలిన్.. చరిత్రలో నిలిచిపోయేలా.. మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలిచేలా పాలన సాగిస్తున్నారు.
తాజాగా కేంద్రం పెట్రోలు ధరలను పెంచిన వెంటనే.. రాష్ట్రం వాటా పన్నులను వదులుకుంటూ.. లీటరుపై కనీసం రూ.10 తగ్గేలా నిర్ణయం తీసుకోవడం ద్వారా.. ప్రజల మనసులను గెలుచుకున్న స్టాలిన్ మరోసారి వార్తల్లోకి వచ్చారు.
స్టాలిన్ తీసుకున్న మంచి నిర్ణయాలు, ప్రజలు మెచ్చుకుంటున్నవి..
=) ముఖ్యమంత్రి అయిన వెంటనే మాజీ ఉప ముఖ్యమంత్రులు, ప్రధాన ప్రతిపక్షానికి చెందిన పళనిస్వామి, పన్నీర్ సెల్వం ల ఇళ్లకు వెళ్లి.. వారి అభినందల్ని అందుకుని వచ్చారు. తనకు ఎలాంటి శత్రుత్వాలు లేవని సంకేతాలు ఇచ్చారు.
=) కరోనా నియంత్రణకు సంబంధించిన కమిటీలను ఏర్పాటుచేసినప్పుడు.. ప్రతిపక్షానికి చెందిన వారికే ఎక్కువగా అందులో చోటు కల్పించారు. ఉపయోగపడతారు అనేవారికే చోటు ఇచ్చారు తప్ప.. పార్టీ తేడాలు చూడలేదు.
=) కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల మీద చాలా స్పష్టంగా తన వ్యతిరేకత ప్రకటించారు. అవి రాష్ట్రంలో అమలు కావని తేల్చేశారు. శషబిషలకు, డొంకతిరుగుడు మార్గాలకు వెళ్లలేదు.
=) గత ప్రభుత్వం- స్కూలు పిల్లలకోసం తయారుచేసిన బ్యాగులపై జయలలిత బొమ్మ ఉండగా, ఈ ఏడాది వాటిని పంపిణీ చేయడానికి వెనకాడలేదు. సాధారణంగా అధికారంలో పార్టీ మారగానే.. తమ పార్టీ రంగులు నాయకుల బొమ్మలు వేయడానికి కోట్లు ఖర్చు పెడతారు. ఆ ఖర్చును స్టాలిన్ ఆపారు.
=) పెట్రోలియం ఉత్పత్తుల ధరలను కేంద్రం తాజాగా పెంచగానే.. తమిళనాడులో మాత్రం ధరలుతగ్గాయి. స్టాలిన్ ప్రభుత్వం రాష్ట్రవాటాగా పెట్రోలుపై విధించే పన్నులను తగ్గించింది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే.. కనీసం లీటరుపై పదిరూపాయలు అక్కడ తక్కువకు దొరుకుతుంది.
ఇవి కూడా చదవండి :
పవర్ స్టార్ పవన్ = గ్యాంగ్‌స్టర్ నయీమ్.. ఎలాగో తెలుసా?
అభిమానులు ఊహించని స్టెప్ వేసిన జనసేనాని
=) మార్నింగ్ వాక్ కు వెళుతూ, మోటారు సైకిలుపై తిరుగుతూ.. సామాన్యులు ఉన్న ప్రాంతాలకే స్వయంగా వెళ్లి వాళ్లతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్నారు.
=) అసెంబ్లీలో తన మీద పొగడ్తలకు అడ్డుకట్ట వేశారు. ఎమ్మెల్యేలు ఎవరైనా సభలో తనను పొగిడితే ఊరుకోనని హెచ్చరించారు. సమస్యలు మాత్రం ప్రస్తావించాలని చెప్పారు. గతంలో జయలలిత హయాంలో సభ పూర్తిగా స్తోత్రపాఠాల్లాగా ఉండేది. ప్రతిఒక్కరూ అమ్మను కీర్తించడంతోనే సరిపోయేది. ఆ వైఖరికి స్టాలిన్ తరహా పూర్తి భిన్నం.
అనేక కీలక నిర్ణయాలతో ప్రజల హృదయాలు గెలుచుకుంటున్న స్టాలిన్, ఇతర రాష్ట్రాల సీఎంలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పట్ల మోకరిల్లే ధోరణితో కాకుండా.. స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు చుక్కానిలాగా మారుతున్నారు. ఇలాంటి నాయకుడి గురించి విన్నవాళ్లు.. ఆడు మగాడ్రా బుజ్జీ అనకుండా ఎలా ఉంటారు?
ఇవి కూడా చదవండి :
హవ్వ.. రాజగురువు చెప్పినట్టే టీటీడీ ఆడుతోందా?
ప్రజల్లో లోపమే.. ఇష్టారీతిగా ధరల పెంపుదలకు కారణమా?
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?
.

Discussion about this post