రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఫిట్మెంట్ పై ఉద్యోగులంతా నిరుత్సాహంతో ఉన్నారని తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు కన్నావరం హరిబాబు తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆదాయం తగ్గిన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జీతాలు పెంచారని అన్నారు.
అప్రజాస్వామికంగా ఫిట్మెంట్ 23 శాతం ప్రకటించడమే కాకుండా చీకటి జీవో జారీ చేసి ఉద్యోగస్తుల కడుపుకొట్టడం దారుణమని సీఎం జగన్మోహన్ రెడ్డి జీతాలు పెంచగపోగా తగ్గించారని రిటైర్డ్ ఉద్యోగస్తుల పెన్షన్ ప్రయోజనాలకు కూడా కోత విధించిన ప్రభుత్వాన్ని ఏమనాలని అన్నారు.
పదకొండవ పీఆర్సీ అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ బహిర్గతం చేయాలని దాని ప్రకారం శాస్త్రీయమైన పిట్మెంట్ 30 శాతం తగ్గకుండా చూడాలని ఇంటి అద్దె స్లాబ్ రేట్లను తగ్గించకుండా యధాతథంగా 30%,20%, ,14.5%,12% శాతం లనుకొనసాగించాలని, పెన్షనర్లకు క్వాంటం ఆఫ్ పెన్షన్ కొనసాగించాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు.
అదే విధముగా ఎప్పటికప్పుడు కరువు భత్యంను విడుదల చేస్తూ,మినిమంటైం స్కేలును అన్ని కేడర్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు ఆదేశించిన నియమాలతో వర్తింప చేయాలని అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని ఇనుమడింప చేయడం ప్రభుత్వ ధర్మమని తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు కన్నావరం హరిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Discussion about this post