ఆలయ పాలకమండలిలో గాండ్ల కులస్తులకు సభ్యులుగా స్తానం కల్పించకపోవడం చాలా బాధాకరమని అఖిల గాండ్ల తెలికుల మహా సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి కన్నావరం హరిబాబు పత్రికాముఖంగా తెలిపారు.
చిత్తూరు జిల్లా లోని ప్రతి నియోజకవర్గంలోను గాండ్ల కులస్తుల ఓటర్లు 10 వేల పై చిలుకు ఉన్నారని అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోను అత్యధికంగా మా యొక్క గాండ్ల కులస్తులు ఉన్నారని తెలిపారు.
ఈ సందర్భంలో హరిబాబు మాట్లాడుతూ 1995 వ సంవత్సరం నుండి మా గాండ్ల కులస్తులకు వరుసగా గత ప్రభుత్వాలు పాలకమండలి ఏర్పాటు చేసేటపుడు ఆ యొక్క పార్టీలో పనిచేసే కార్యకర్తలకు పాలకమండలి నియామకంలో స్తానం కల్పిచేవారని
అదేవిధంగా యాంత్రీకరణ రాకముందు మా పూర్వికులు నూనె ఆడించే పురాతన కులవృత్తిని రాజుల కాలం నుండి ప్రతి దేవాలయాలకు ధూప దీప నైవేధ్యాలకు వివిధ రకాల నూనెలను మా పెద్దలు అందించేవారని, శ్రీకాళహస్తి బ్రహ్మోస్తవాల్లో గిరిప్రదక్షిణలో భాగంగా రెండవ ఉభయదారులమని తెలిపారు.
కావున స్థానిక శాసన సభ్యుల వారు ఒకసారి పాలకమండలి ఏర్పాటు విషయంలో ఇలాంటి పొరబాటు రాకుండా మీ పార్టీలో కార్యకర్తలు అయినటువంటి మా కులస్తుకు న్యాయం చేయాలని పత్రికాముఖంగా కన్నావరం హరిబాబు తెలిపారు.
.