చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వెలసిన జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని బుధవారం రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ దర్శించుకున్నారు.
ఆలయ కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు ఈమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు.
స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి మర్యాదపూర్వకంగా ఆమెను కలిశారు.
ఆలయ అభివృద్ధిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.
.