తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు వేమారెడ్డి సురేంద్ర రెడ్డి, జిల్లా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి గాలి ప్రకాష్ నాయుడు కోరారు.
ఈ మేరకు వారు సోమవారం గూడూరు ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు తీవ్రంగా నష్ట పోయారన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వారికి పరిహారం చెల్లించడంలో విఫలమైందన్నారు.
అధిక వర్షం కారణంగా పంట దిగుబడి కూడా బాగా తగ్గి పోయిందన్నారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కేంద్రాలు ఏర్పాటు చేయలేదన్నారు. రంగు మారిన కారణంగా ప్రైవేటు వ్యాపారులు ముందుకు రావడం లేదన్నారు.
మద్దతు ధర లేక పోవడంతో రైతులు నష్ట పోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార పంటలకు ఎకరాకు రూ.30వేలు, వాణిజ్య పంటలకు రూ.50వేల వంతున పరిహారం చెల్లించాలని డిమాండు చేశారు. లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చానేతలు మోహన్ బా బాబు తదితరలు పాల్గొన్నారు.
.