అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప ది రైజ్ చిత్రం నుంచి.. ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ అంటూ సాగే నాలుగో సింగిల్ విడుదలైంది. విడుదలైన మరుక్షణం నుంచి ఈ పాటకు అనూహ్య స్పందన వస్తుంది.
రష్మిక మందన్న కథానాయిక కాగా, ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్రహిత, మళయాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. ఇందులో సమంత ఒక ఐటెం సాంగ్ చేస్తుండడం విశేషం.
ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా. పాట పూర్తి సాహిత్యం చూడండి
ఈ పక్క నాదే.. ఆ పక్క నాదే.. తలపైన ఆకాశం ముక్క నాదే..
ఆ తప్పు నేనే.. ఈ ఒప్పు నేనే.. తప్పొప్పులు తగలెట్టే నిప్పు నేనే..
నన్నయితే కొట్టేటోడు భూమ్మీదే పుట్టలేదు..
పుట్టాడా అది మళ్ళా నేనే..
నను మించి ఎదిగేటోడు ఇంకోడు ఉన్నాడు చూడు.. ఎవడంటే అది రేపటి నేనే..
నే తిప్పానా మీసమట.. సేతిలోన గొడ్డలట.. సెసిందే యుద్దమాట.. సేయందే సంధి అటా…
ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా.. (4)
నిను ఏట్లో ఇసిరేస్తా.. నే సేపతో తిరిగొస్తా..
గడ కర్రకు గుచ్చేస్తా.. నే జెండాలా ఎగరేస్తా..
నిను మట్టిలో పాతేసి మాయం చేస్తా..
ఖరీదైన ఖనిజంలా మళ్లీ నేను దొరికేస్తా..
ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా.. (4)
ఎవడ్రా ఎవడ్రా నువ్వు.. ఇనుమును ఇనుమును నేను..
నను కాల్చితే కత్తి అవుతాను..
ఎవడ్రా ఎవడ్రా నువ్వు.. మట్టిని మట్టిని నేను..
నను తొక్కితే ఇటుకవుతాను..
ఎవడ్రా ఎవడ్రా నువ్వు.. రాయిని రాయిని నేను..
గాయం కానీ చేశారంటే ఖాయంగా దేవుడిని అవుతాను..
ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా.. (4)
.

Discussion about this post