• About Us
  • Contact Us
  • Our Team
Monday, July 27, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

Good Morning : Out of sight is.. థియరీ నిజమేనా?

admin by admin
November 23, 2021
0
Good Morning : Out of sight is.. థియరీ నిజమేనా?

వ్యక్తుల విషయంలో మన ప్రాధాన్యాలు ఏమిటి? ఎలా ఉంటాయి. సాన్నిహిత్యం అనేది ఎవరితో ఎలా ఏర్పడుతుంటుంది? ఎలా కొనసాగుతుంటుంది. వ్యక్తులతో పరిచయం- అనుబంధం దాకా పరిణమించడానికి మధ్యలో ఎన్ని దశలు ఉంటాయి. ఏయే కారణాలు  అనుంధాల్ని తయారుచేస్తాయి, నడిపిస్తాయి, శాసిస్తాయి? ఇలాంటి ప్రశ్నలకు ఒక పట్టాన జవాబు చెప్పడం కష్టం.

ఏ రెండు అనుబంధాలను పరిశీలించినా.. అవి బలపడిన కారణాలు ఏకరీతిగా అనిపించవు. ఒక్కొక్కరి మధ్య ఒక్కొక్క కారణంగా అనుబంధం బలపడుతుంటుంది. బతుకు గమనంలో పరిచయాలు వందలు వేలుగా అవుతుంటాయి. కొన్నే బలపడతాయి. సన్నిహితం అవుతాయి.. అది కాస్తా పెరిగి అనుబంధం అవుతుంది. కొన్ని అనుబంధం రూపుదాల్చినా సరే.. కాలక్రమంలో మాసిపోతుంటాయి.

ఇలాంటి ద్వైధీ చింతనలకు సంబంధించి.. ఒక సుభాషితం చిన్న విశ్లేషణ అందిస్తుంది.

దూరస్థో అపి న దూరస్థో యో యస్య మనసి స్థితః
యో యస్య హృదయే నాస్తి సమీపస్థో అపి దూరతః

ఎవడైతే మీ మనసులో నివసిస్తుంటాడో.. వాడు మీనుంచి ఎంత సుదూర ప్రాంతాల్లో ఉంటున్నప్పటికీ దూరంగా ఉన్నట్టు కాదు! దూరంగా ఉంటున్నాడా దగ్గరగా ఉంటున్నాడా అనే ప్రశ్నకు విలువ లేదు. అలాగే మీ హృదయంలో చోటు లేనివాడు- మీ పక్కనే కూర్చుని ఉన్నా సరే.. మీకు చాలా చాలా దూరంలో ఉన్నట్టే లెక్క! -అనేది శ్లోకభావం.

ఒకరితో అనుబంధం మనకు మనస్ఫూర్తిగా ఏర్పడితే చాలు- వారు భౌతికంగా ఎంత దూరంలో ఉన్నారనే అంశానికి అసలు విలువ లేదంటుంది ఈ సుభాషితం. ఒక రకంగా చెప్పాలంటే.. మనం నిత్యజీవితలో నమ్మే అలవాటు అయిన జీవిత విలువలకు ఇది విరుద్ధం. Out of sight is out of mind అని మనం చెప్పుకుంటూఉంటాం. ఎంత దగ్గరి వాళ్లయినా సరే.. టచ్ లో ఉండడం మానేస్తే గనుక కొన్నాళ్లకు పూర్తిగానూ మరిచిపోతాం అనేది ఇది చెప్పే సిద్ధాంతం.

మానవ సంబంధాల విషయంలో మనం నిత్యం ఎవరితో మెలగుతూ ఉంటామో. ఎవరు మనకు ప్రతినిత్యమూ తారసపడుతుంటారో వారే ఎక్కువ సన్నిహితులు అనుకుంటూ ఉంటాం. ఈ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని చాలా ప్రేమకథా చిత్రాలు వచ్చాయి కూడా. విజయవంతమూ అయ్యాయి. అలా ఈ సిద్ధాంతానికి నిజమేననే మన్నన దక్కింది కూడా.

EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి

ఈ సుభాషితం చెబుతున్నది వేరే. ఒకసారి మనసులో ముద్ర పడితే ఇక ఎప్పటికీ వారు మనకు ఆత్మీయులే అంటుంది ఈ సిద్ధాంతం. అలా దూరాన్ని బట్టి, మన కళ్ల ముందు మెదలుతున్నారా? లేదా? అనేదానిని బట్టి మాత్రమే వారిని గుర్తుంచుకుంటే.. అది మంచి అనుబంధం ఎలా అవుతుంది?

ఒకరు మన మనసులోకి వచ్చారంటే ఇక వారు ఎప్పటికీ మనతో ఉన్నట్టే. మనలోని చైతన్యానికి వారు కారకులుగా ఉంటారు. దీనిని స్వానుభవంలో తెలుసుకున్నప్పుడు ఇక ‘దూరం’ అనే స్పృహ కలగదు. బంధాలు పలచబడడం అనేది ఉండదు.

శుభోదయం.

నయీం డైరీస్ : ఒక సాహసోపేత ప్రయత్నం!

తమ్మినేని అలా చేస్తే జగన్‌కు చిక్కులేనా?

జగన్: మడమ తిప్పని నేతే.. మాట మార్చేస్తాడు!

Tags: BhartrihariBhartrihari subhashithamgood morninggood morning thoughtquotes on agriculturequotes on good thoughtssubhashitamsubhashithamwhat to sowwhat you sow is what you reapభర్తృహరి సుభాషితంమంచిమాటశుభోదయంసుభాషితం
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply