షారుఖ్ ఖాన్ అనే పేరు మనందరికీ తెలిసిందే. నవంబర్ 2న పుట్టిన షారుఖ్ ఖాన్ కేవలం హిట్స్ ఇవ్వడం మాత్రమే కాకుండా, చాలా మంచి, రిస్క్ లు తీస్కునే నటుడిగా, ఇంక అభిమానులను ప్రేమించే ప్రముఖుడిగా పేరు పొందాడు. బాలీవుడ్ ఇండస్ట్రీ లో వినబడే చాలా పెద్ద పేర్లలో షారుఖ్ ఖాన్ పేరు కూడా ఒకటి. మరి కింగ్ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా ఆదర్శిని డాట్ కామ్ పుట్టినిరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది.
ఈరోజు తనకు 55 నిండినా కూడా, తను ఎప్పుడు ‘యంగ్ అండ్ హాండ్సమ్’ గానే ఉంటాడు షారూఖ్. తన మొదటి సినిమా దీవానా, 1992 జూన్ లో విడుదల అయింది. ఇందులో షారుఖ్ దివ్యా భారతి, రిషీ కపూర్ లతో నటించాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయి, షారుఖ్ కు సినిమాలలో మరిన్ని అవకాశాలను తెచ్చి పెట్టింది. తనకు అప్పట్లో బెస్ట్ మేల్ డెబ్యూ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా వచ్చింది. మీడియా షారుఖ్ ను బాద్షాహ్ ఆఫ్ బాలీవుడ్ అని కూడా పిలుస్తూ ఉంటుంది. ఇవి కాకుండా షారుఖ్ ఖాన్ కు ఉన్న పేరులు, ‘కింగ్ ఆఫ్ బాలీవుడ్’, ‘కింగ్ ఖాన్‘, ‘రొమాన్స్ కింగ్’… షారుఖ్ 80 పైన సినిమాలలో నటించి, 14 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ తో కలిపి, చాలా అవార్డ్స్ సంపాదించుకుని ఉన్నాడు. మన భారత ప్రభుత్వం తనకి పద్మశ్రీ కూడా ఇచ్చింది.
కేవలం మన దేశంలోనే కాదు, వేరే దేశాల వాళ్లు కూడా షారుఖ్ ని గౌరవిస్తారు. రుజువేంటి అని అడుగుతున్నారా? ఫ్రాన్స్ ప్రభుత్వం తనకు ఓర్డ్రె డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెట్రెస్ ఇంక లీజియన్ ఆఫ్ ఆనర్ అనే అవార్డ్స్ అందించి ఉంది. దీవానా తరువాత కొన్ని సినిమాల్లో షారుఖ్ ఖాన్ బాజీగార్, డర్, అంజామ్ లాంటి కొన్ని సినిమాల్లో విలెన్ పాత్ర పోషించాడు. కొన్ని రొమాంటిక్ సినిమాల్లో నటించాక, షారుఖ్ ఖాన్ ప్రాముఖ్యత పెరిగింది. 2015 ప్రకారం, షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్-టైన్మెంట్ కంపెనీ కో-ఛైర్మన్, కోల్కతా నైట్ రైడర్స్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్ టీమ్) కు కో-ఓనర్, ఇంక ట్రిన్బాగో నైట్ రైడర్స్ (కారబ్బీన్ ప్రీమియర్ లీగ్ టీమ్) కు కూడా కో-ఓనర్. తను కేవలం నటుడు మాత్రమే కాదు, నిర్మాత కూడా. ఇలాంటి వ్యక్తి మన భారత దేశానికి చెందినందుకు మనం గర్వపడాలి.
కింగ్ ఖాన్ అని పిలవబడే షారుఖ్ ని రొమాన్స్ కింగ్ అని కూడా పిలుస్తారు. అభిమానులు తనని రొమాంటిక్ సినిమాలలో చూసి ఎంతగా ఆనందిస్తారో, అంతగానే అభిమానులను ఎమోషనల్ సీన్స్ తో భావోద్వేగాలను కలిగించే లక్షణం షారుఖ్ లో ఉంది. తన పుట్టిన రోజు సందర్భంగా, మనలో భావోద్వేగాలను రేకెత్తించే షారూఖ్ నటించిన ఐదు సినిమాల సీన్స్ గురించి కింద చదవండి.
చక్ దే! ఇండియా : సత్తర్ మినిట్
ఇది ఒక ఎమోషనల్ సినిమా కాదు. కానీ సినిమా క్లైమాక్స్ లో షారుఖ్ ఖాన్ ఆట ముందు తన మహిళా క్రీడాకారులకు ఇచ్చే ప్రసంగం మనందరిలోనూ దేశభక్తి భావన కలిగిస్తుంది. డైలాగ్ మొదటిలో షారుఖ్ ‘ ఆజ్ తుమ్ అచ్ఛా ఖేలో యా బురా, యే సత్తర్ మినిట్ తుమే జిందగీ భర్ యాద్ రహేంగే ’ (ఈరోజు మీరు ఎలా ఆడినా కూడా, ఈ డెబ్భై నిమిషాలు మీకు జీవితాంతం గుర్తుండిపోతాయి). కేవలం ఆ ఒక్క డైలాగ్ తో ఆ ప్రసంగం మొత్తం అభిమానులకు గుర్తుండిపోతుంది.
కభీ ఖుషా కభీ ఘమ్ : అమ్మని మళ్లీ కలుసుకోవడం
కభీ ఖుషీ కభీ ఘమ్ సినిమాలో షారుఖ్ ఖాన్ అభిమానులు కావాలనుకున్న ప్రతి ఒక్క భావాన్నీ చూపించాడు. సినిమాలో ప్రతి ఒక్క పాత్ర రాహుల్ తన తల్లి-దండ్రులను మళ్లీ కలవాలని ఆశ పడుతూ ఉంటారు. ప్రేక్షకులు కూడా అదే కోరుకుంటుంటారు. లాడూ ఇంక పూ కలిసి రాహుల్ తల్లి-దండ్రులను కలిసేలాగా ఒక ప్లాన్ వేస్తారు. కానీ దానికి ముందే రాహుల్ కు తన అమ్మని మళ్లీ కలుసుకునే అవకాశం వస్తుంది.
ఇతర పాత్రలు దానికి ఎంత ఎమోషనల్ గా స్పందిస్తారు అనేది మనలో భావోద్వేగాలను కలిగిస్తుంది. కానీ దానికన్నా ఎక్కువగా, రాహుల్ పాత్ర పోషిస్తున్న షారుఖ్ తన అమ్మని కౌగిలించుకుని, ఆపకుండా ఏడవడం అనేది ఇంకా ఎక్కువ బాధను తెప్పిస్తుంది. తన అమ్మకి కొడుకుని కూడా పరిచయం చేస్తాడు. కానీ ఇదంతా జరుగుతున్నప్పుడు, ఒక్కసారి కూడా అమ్మని వదలడు.
కల్ హో న హో : డైరీ సీన్
అద్భుతమైన ప్రదర్శనలతో ఈ సినిమా మనలో భావోద్వేగాలు కలిగించడంలో ప్రతిసారీ విజయవంతంగా ఉంటుంది. కానీ ఇందులో అన్ని సీన్స్ కన్నా ఎక్కువ బాధగా అనిపించే సీన్ డైరీ సీన్. ఆ సీన్ లో అమన్ నైనా కోసం తనకున్న భావాలను వ్యక్తం చేసి, అవి తన స్నేహితుడు రోహిత్ భావాలన్నట్టు నైనా ని నమ్మిస్తాడు. స్నేహితుడి కోసం తను అత్యంత ఎక్కువగా ప్రేమించిన అమ్మాయిని కూడా వదులుకుంటాడు.
వీర్ జారా : తన ప్రేమను వదులుకునే సీన్
షారుఖ్ ఖాన్ చాలా రకమైన పాత్రలను బాగా పోషించాడు. ఒక మంచి తండ్రి పాత్రతో సహా. కానీ ఈ సీన్ లో తను ఒక మంచి కొడుకు పాత్ర పోషిస్తాడు. జారాని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వీర్, కేవలం జారా వాళ్ల అమ్మ ఏడవకుండా ఉండాలని, తన ప్రేమను వదులుకుంటాడు. అలా చేస్తూ, జారా తన తండ్రి మాటను వింటుందని జారా వాళ్ల అమ్మకి మాటకూడా ఇస్తాడు.
మొహబ్బతే : ఆప్ జీత్ గయే
ఈ సీన్ కు 2000లో బెస్ట్ సీన్ ఆఫ్ ది ఇయర్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా వచ్చింది. రాజ్ ఆర్యన్ మల్హోత్రా (షారుఖ్) నారాయణ్ శంకర్ (అమితాభ్ బచ్చన్) కు ప్రేమ గురించి నేర్పించడానికి గురుకుల్ లోకి ప్రవేశిస్తాడు. కానీ, ప్రేమ గురించి మాట్లాడితే తను ఒక్కడే కాకుండా విద్యార్థులందరినీ అక్కడినుంచి వెళ్లగొడతాను అని బెదిరింపగా, రాజ్ తన ఒటమిని ఒప్పుకుని వెళ్లిపోవాలని నిశ్చయించుకుంటాడు. రాజ్ త్యాగం చేసినా కూడా, నారాయణ్ తను గెలిచాడని రాజ్ కు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు.
రాజ్ తను అణగదొక్కి పెట్టుకున్న భావాలను ఇక భరించలేక, ఓడిపోయినది తనే అని నారాయణ్ కు గుర్తు చేస్తాడు. తమ ప్రేమను అంగీకరించలేదని చనిపోయిన కూతురి ఫోటో ముందు నిల్చుకునేది నారాయణ్ అని చెప్తాడు. షారుఖ్ గురుకుల్ కి మేఘనా ఇంక తన తండ్రి కోసమే వచ్చాడని చెప్తున్నప్పుడు తన కళ్లలోనుంచి నిజంగానే కన్నీళ్లు వస్తాయి.
సినిమాలో భావేద్వేగాలను పలికించడం అంత చిన్న విషయం కాదు. ఆ భావోద్వేగాలను యావత్ ప్రేక్షకుల్లో కూడా కలిగించడమూ చాలా గొప్ప సంగతి. అలాంటి వాళ్లనే మహా నటులు అని మనం పిలుచుకుంటూ ఉంటాం. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అలాంటి మహానటులు ఎంతో మంది ఉన్నారు. వారిలో ఒకరైన షారూఖ్ కు ఆదర్శిని డాట్ కామ్ మరోసారి శుభాకాంక్షలు చెబుతోంది.
(ఇదీ చదవండి : అలా చేస్తే జగన్కు నష్టం గ్యారంటీ )
.