శ్రీకాళహస్తికి చెందిన జనమాల గురు సాత్విక్ అనే విద్యార్థి సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరచి శెభాష్ అని పించుకున్నాడు.
జనమాల గురు సాత్విక్ శ్రీకాళహస్తి పట్టణంలోని ద స్కూల్ లో 6వ తరగతి చదువుతున్నాడు. చంద్రగిరి లోని అక్షరధామ్ కోచింగ్ సెంటరులో సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు శిక్షణ తీసుకున్నాడు.
ఈ ఏడాది జనవరి 9వ తేదీన జాతీయ స్థాయిలో సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష జరిగింది. ఈ ప్రవేశ పరీక్షలో జనమాల గురు సాత్విక్ ఎస్సీ విభాగం నుంచి ఏపీ కోటాలో మొదటి స్థానంలో నిలిచాడు.
దీంతో అతనికి తమిళనాడులోని మిలిటో సైనిక్ స్కూల్ లో ప్రవేశం పొందడానికి అర్హత సాధించాడు.
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన జనమాల గురు సాత్విక్ ను సీపీఐ ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య, అక్షరధామ్ కోచింగ్ సెంటరు డైరెక్టర్ యుగంధర్ రెడ్డి, ద స్కూల్ యాజమాన్యంతో పాటు పలువురు అభినందించారు.
.