బల్దియా ఎన్నికల్లో బీజేపీ దూకుడు, హవా, వారి ప్రాభవం చూసి అధికార టీఆర్ఎస్ కంగారు పడుతున్నట్లుగా కనిపిస్తోంది. బీజేపీ విషయంలో.. వారిని తాము లెక్క చేయడం లేదన్నట్లుగా కొందరు, వారిని మించిన దుర్మార్గులు మరొకరు లేరన్నట్లుగా కొందరు మాట్లాడుతుండడం.. ఈ భయానికి నిదర్శనం. ఆ పార్టీ అధిపతి కేసీఆర్ ఒక తీరుగా, నగర రాజకీయాల్లో కీలకమైన తలసాని శ్రీనివాసయాదవ్ ఒక తీరుగా మాట్లాడుతూ.. తమ పార్టీలోని భయాన్ని బయటపెట్టుకుంటున్నారు.
దుబ్బాకలో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి అందరికీ తెలుసు. ఆ ప్రభావం ఖచ్చితంగా జీహెచ్ఎంసీ ఎన్నికల మీద ఉంటుంది. అయితే కొన్ని రోజుల కిందట మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ.. నగరంలో తమకు ప్రధానంగా పోటీ కాంగ్రెస్ తోనే ఉంటుందన్నారు. బీజేపీని అసలు తాము లెక్కలోకి తీసుకోవడం లేదని అన్నారు. బీజేపీని పట్టించుకోవడం లేదన్నట్టుగా, వారి గురించి భయపడడం లేదని సంకేతాలు వెళ్లేలా ఆయన ప్రయత్నించారు.
ఇవీ చదవండి : పవన్‌ని దూరం పెడితే.. బీజేపీకి ఆశాభంగం తప్పదు.. నష్టమే! కొవిడ్ భయం ఉందా.. మీకిదే శుభవార్త! అయోధ్య నగరం ఓ అద్భుతాన్ని నమోదు చేసింది..
రోజులు గడిచాయి.. కాంగ్రెస్ నుంచి నాయకులు క్యూ కట్టి వెళ్లి బీజేపీని కలవడం కూడా జరుగుతోంది. కమలదళంలో అందరూ చేరిపోతున్నారు. గులాబీ బాస్ పార్టీ కార్యాలయంలో మీటింగు కూడా పెట్టారు. దిశానిర్దేశం చేశారు. ఆయన మాత్రం పూర్తిగా బీజేపీ మీదనే విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు. ఒకవైపు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ 100కు పైగా స్థానాలు గెలుస్తామని అంటూనే.. మరోవైపు.. బీజేపీని తూర్పార పట్టారు.
తెరాస దళాలు ఇలా ద్వంద్వ వైఖరిలో ఉన్నాయి. ఒకరేమో బీజేపీ అసలు ప్రత్యర్థే కాదని డాంబికాలు పలుకుతారు. మరొకరేమో బీజేపీని తప్ప మరొకరిని నిందించరు.. ఇలా వారిలోనే రోజురోజుకూ కంగారు పెరుగుతోందని అర్థమవుతోంది. నాయకులు ఇలా రెండు రకాలుగా మాట్లాడుతూ ఉంటే.. వారి మీద ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందని కూడా ప్రజలు భావిస్తున్నారు.
.

Discussion about this post