రామాయణంలో శ్రీరామచంద్రుడు కూడా.. తన వానరసేనలను వెంటబెట్టుకుని లంకకు చేరుకున్న తరువాత.. తుది సమరానికి ముందుగా చిట్టచివరి అవకాశంగా రావణుడి వద్దకు ఓ దూతను పంపాడు. వాలి కొడుకు అంగదుడు దూతగా వెళ్లి.. యుద్ధానికి ముహూర్త నిర్ణయం చేయమని రావణుడినే అడిగాడు.
అడిగింది ముహూర్తమే అయినా- రావణుడి తీరులో ఏమైనా మార్పు వస్తుందేమో అని ఒక పరీక్ష అది! రావణుడిలో మార్పు రాలేదు. మంచి ముహూర్తమే పెట్టాడు గానీ.. అప్పటిదాకా ఉన్న తన మూర్ఖత్వాన్ని వదులుకోలేకపోయాడు. ఆ తర్వాత ఏమైందో మనందరికీ తెలుసు.
ఇప్పుడు తెలంగాణ సారథి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా.. మహాయుద్ధానికి ముందుగా కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వానికి చివరి ఛాన్స్ ఇస్తున్నారు. ఇక్కడ అంగదుడి అవసరం కూడా లేదు.. తానే స్వయంగా వెళ్లారు. ఢిల్లీలో ప్రధాని మోడీతో యాసంగిలో ధాన్యం సేకరణ అంశంపై ప్రధాని మోడీతో భేటీ అయి విన్నవించాలని ప్రయత్నించారు. అపాయింట్మెంట్ దొరకలేదు. తిరిగివచ్చారు. శుక్రవారం నాడు తన పార్టీ మంత్రులను మళ్లీ ఢిల్లీ పంపనున్నారు. కేంద్రం స్పందనను బట్టి.. నరేంద్రమోడీ ప్రభుత్వం వైఖరి మీద తాను సాగించబోయే మహా యుద్ధాన్ని కేసీఆర్ ప్రకటించబోతున్నారు.
ఇది కూడా చదవండి : మోడీ, చంద్రబాబు.. ‘ఈ జన్మలో చూడలేం’ అనుకున్నది చూపించారు
చట్టాలు తయారు చేసే స్థానంలో ఉంటూ బండబూతులు తిట్టుకునే సిగ్గుమాలిన రాజకీయం
ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ తొలినుంచి కేంద్రం వైఖరిపై అలుపెరగకపోరాడుతున్న సంగతి తెలిసిందే. సామదానభేద దండోపాయాలను ప్రయగించాలనే యుద్ధనీతిని అచ్చంగా ఆచరిస్తూ కేసీఆర్ అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. మోడీ సర్కారు నుంచి సరైన స్పందన ఉండడం లేదు. ఆయనతోనే భేటీ కావడానికి కేసీఆర్ సహా మంత్రుల ఎంపీల బృందం ఢిల్లీ వెళ్లింది. అక్కడ మోడీని కలవలేదు గానీ.. కేంద్ర మంత్రుల్ని కలిశారు. వారినుంచి సరైన స్పందన లేదని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో, మూడురోజులు ఢిల్లీలో ఉన్నప్పటికీ ప్రధాని మోడీని కలవలేకపోవడంపై సీఎం కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. అయినా సరే.. తాను సమరంలోకి దిగి మహాయుద్ధం ప్రారంభించే ముందు లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలని ఆయన అనుకుంటున్నారు. అందుకే శుక్రవారం మరోసారి మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపనున్నారు.
ఈసారి కూడా ఢిల్లీనుంచి ధాన్యం కొనుగోలుపై సానుకూల స్పందన రాకపోతే.. అప్పుడిక వార్ షురూ అవుతుంది. ఇప్పటిదాకా మాటల వరకే ఆగిన కేసీఆర్- తాను వార్ ప్రకటిస్తే ఎలా ఉంటుందో మోడీ సర్కారుకు రుచిచూపించాలని అనుకుంటున్నట్టు సమాచారం.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
కేంద్రంలోని బీజేపీ పాలన వ్యవహార సరళి మీద కేసీఆర్ ది మొదటినుంచి పోరుబాటగానే ఉంది. దానికి తోడు హుజూరాబద్ ఉప ఎన్నిక విషయంలో ఈటల రాజేందర్ విజయం తర్వాత.. ఆయన డైరెక్ట్ ఎటాక్ కి పూనుకుంటున్నారు. గతంలో కూడా కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సారథ్యంలోని కూటములు కాకుండా మూడో ప్రత్యామ్నాయ కూటమి తీసుకురావడానికి దేశంలోని అన్ని కీలకమైన ప్రాంతీయ పార్టీలతో చర్చించి.. ఒక దశవరకు తీసుకువచ్చిన కేసీఆర్.. ఈసారి మోడీ మీద యుద్ధం ప్రకటిస్తే.. ఇంకెంత చురుగ్గా రాజకీయం నడుపుతారో చూడాలి.
Discussion about this post