ఆంధ్ర ప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో విజయవాడలో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి టెన్నిస్ పోటీల్లో
శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంజీఎం కళాశాలకు చెందిన ఎస్.నాగ నితీష్ అనే విద్యార్థి విశేష ప్రతిభ కనబరచి కాంస్య పతకం సాధించాడు.
ఈ విద్యార్థిని సోమవారం కళాశాల నిర్వాహకులు అభినందించారు.
తమ కళాశాలో చదువుతో పాటు ఆటలకు మంచి ప్రాధాన్యత ఇస్తున్నట్లు డైరెక్టరు గుడ్లూరు మయూర్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వీఎస్ రత్నం తదితరులు పాల్గొన్నారు.
.