గొర్రెలు మరియు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఛైర్మన్ గా ఎన్నుకోబడిన గన్నేరు ప్రకాశం యాదవ్ ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం నాడు ఘనంగా సన్మానించారు.
ఈనెల 4న గొర్రెలు మరియు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఛైర్మన్ గా ప్రకాశం యాదవ్ ను నియమిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పూనం మాలకొండయ్య ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.
ఈనెల 27న ఉదయం 10:30 గంటలకు గుంటూరు కొత్తపేట వెటర్నరీ హాస్పిటల్ నందు జరిగే పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేయాల్సిందిగా ప్రకాశం యాదవ్, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆహ్వానించారు.
మేనేజింగ్ కమిటీ మరియు అన్ని జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం కమిటీ సభ్యులుగా యూనియన్ అధ్యక్షులుగా తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం కు చెందిన జి.ప్రకాశం యాదవ్ నియామకం ఎ.పి కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 1964 సెక్షన్ 34 (1) ప్రకారం రెండు సంవత్సరాల కాలానికి చైర్మన్ ఆర్డర్లు జారీ చేయబడింది.
ఈ మేరకు పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్ , ఫిషరీస్ శాఖ జి ఓ 267ను 04.వ తేదీ విడుదల చేసింది. దీని ద్వారా చైర్మన్ మరియు జిల్లా మొత్తంతో మేనేజింగ్ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రకాశం యాదవ్ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆహ్వానించి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్సీ రెడ్డి , పవన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
.