రాయలసీమ ప్రాంతానికి చెందిన కథకుడు సన్నపు రెడ్డి వెంకట రామిరెడ్డికి తానా అవార్డ్ తెచ్చిపెట్టిన నవల “కొండ పొలం” ను దర్శకుడు క్రిష్ సినిమా గా తీస్తున్నాడన్న వార్త తెలుగు పాఠకులలో ఆసక్తి రేపింది. నవలలు సినిమాగా రావడం తెలుగులో ఈ మధ్యన తగ్గిపోయింది.
ఇంగ్లీష్‌లో హిట్ అయిన ఎన్నో నవలలను సినిమాలుగా తీశారు. అయితే నవలను అంతే గొప్పగా సినిమా తీయడం చాలా తక్కువ సార్లు మాత్రమే జరిగింది. సాహిత్యాభిరుచి ఉన్న దర్శకుడు. క్రిష్ తన ప్రయత్నంలో సఫలీకృతం అయ్యాడు.
కొండపొలం అంటే కరవు కాలంలో గొర్రెలకు మేత, నీళ్లు దొరకడం కష్టమైపోయినప్పుడు ఊరి వాళ్లు తమ గొర్రెల మందల్ని తీసుకుని అడవికి వెళ్లి కొన్ని నెలల పాటు అక్కడే ఉండి మళ్లీ పరిస్థితులు బాగుపడ్డాక తిరిగి వచ్చే ప్రక్రియ.
అటవీ ప్రాంతంలో గొర్రెలు కాచుకునే వారు పడే ఇబ్బందులను చూపించే ఈ కథకు దర్శకుడు క్రిష్ స్క్రీన్ ప్లే చక్కగా రాసుకున్నాడు. కథకు తగ్గట్టుగా నటీనటులను ఎన్నుకోవడం విశేషం.
ఇవి కూడా చదవండి :
జనంమెచ్చిన సీఎం.. ఆడు మగాడ్రా బుజ్జీ
పవర్ స్టార్ పవన్ = గ్యాంగ్‌స్టర్ నయీమ్.. ఎలాగో తెలుసా?
అభిమానులు ఊహించని స్టెప్ వేసిన జనసేనాని
యూపీఎస్‌సి ఇంటర్వ్యూకు హాజరవుతున్న యువకునిగా నటించిన హీరో వైష్ణవ్ తేజ్ పాత్ర ద్వారా కథను బాగా చెప్పారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేసిన ఓబులమ్మ పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఆ పాత్రలో రకుల్ బాగా ఒదిగిపోయింది.
నవలలో ప్రేమ అంశం లేదని చదివాం. సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ అంశం బావుంది. కథను సినిమాకు అనుగుణంగా మలిచే ప్రయత్నంలో ప్రేమ అంశం బాగా కలిసి వచ్చింది. పర్యావరణాన్ని కాపాడుకోవడం అనే అంశాన్ని సున్నితంగా చెప్పారు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ని చూపించడం ఆసక్తికరం గా ఉంది. ఎర్ర చందనం ను రాయలసీమ మాండలికం లో బొమ్మకర్ర అంటారు.
ఆధునికత వల్ల గిరిజనులు ఎలా ఇబ్బంది పడుతున్నారు అనే అంశాన్ని చక్కగా స్పృశించారు.
క్లైమాక్స్ ను సినిమా టిక్ గా తీశారు. పులి, ఇతర జంతువుల గ్రాఫిక్ వర్క్ బావుంది. గుర్రప్పగా సాయి చంద్ అద్భుతంగా నటించాడు. వైష్ణవ్‌తేజ్‌ను కొన్ని సీన్లలో చూస్తే ఒకప్పటి చిరంజీవి గుర్తుకు వస్తాడు. రవి ప్రకాష్ అడవిలో వుంటూ తన భార్య కోసం పడే తపన, ఆ ఫోను సంభాషణ అక్కట్టుకుంటాయి.
ఇవి కూడా చదవండి :
హవ్వ.. రాజగురువు చెప్పినట్టే టీటీడీ ఆడుతోందా?
ప్రజల్లో లోపమే.. ఇష్టారీతిగా ధరల పెంపుదలకు కారణమా?
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?
సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం సినిమాకు ప్లస్ అయింది. ఆయన ఒక పాట కూడా రాశారు. సినిమా ను నల్లమల అటవీ ప్రాంతంలో డీఓపీ జ్ఞానశేఖర్ అందంగా చిత్రీకరించాడు. నవలారచయిత సన్నపురెడ్డి రాసిన సంభాషణలు బావున్నాయి. పాత్రల తో పలికించిన రాయలసీమ మాండలికం బావుంది.
చాలా ఇష్టపడి, నల్లమల అడవులలో కష్టపడి తీసిన కొండ పొలం సినిమా ఉత్తమాభిరుచి ఉన్న ప్రేక్షకులకు నచ్చుతుందనడంలో సందేహం లేదు.
..రాజేంద్రప్రసాద రెడ్డి
సీనియర్ జర్నలిస్టు


.

Discussion about this post