నగరి నియోజకవర్గ పరిధిలోని కృష్ణాపురం రిజర్వాయర్ గేట్లు తెరవడంతో నగరి నదిలో వరద ఉధృతి తీవ్రంగా ఉంది. నీటిప్రవాహం పంటపొలాలను ముంచేస్తోంది.
నగిరి మండలంలో గురువారం కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. వరి పంట. కూరగాయలు సాగు చేస్తున్న పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మండలంలో 44 ఎంఎం వర్షపాతం నమోదైనట్లు తాసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
భారీవర్షాలకు పంటలు ఎందుకూ కొరగాకుండా పోవడంతో రైతులు లబోదిబో మంటున్నారు. నీటమునిగిన పొలాలను చూసి కన్నీళ్లు పెడుతున్నారు.

.