ఏర్పేడు మండలం సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఏర్పేడు గ్రామ పంచాయతీ సర్పంచ్ నల్ల పాలెం శివయ్యను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.
ఈ మేరకు ఆదివారం నాడు జరిగిన మండల సర్వసభ్య సమావేశం అనంతరం ఈ ఎన్నిక జరిగింది.
శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి నేతృత్వంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా సర్పంచ్ శివయ్యను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివయ్య కు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించారు. కలంకారి చిత్రం తో ఉన్న శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల మెమెంటో శివయ్యకు బహూకరించారు .
ఈ సందర్భంగా శివయ్య ఎమ్మెల్యే బి. మధుసూదన్ రెడ్డి ఆశీర్వాదాలు తీసుకున్నారు .
ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, మండల ఇన్చార్జి కిషోర్ రెడ్డి జడ్పిటిసి డాక్టర్ కావేరి తిరుమలయ్య, ఎంపీపీ గీత, సింగల్ విండో చైర్మన్ జనార్ధన్ యాదవ్, ఉపాధ్యక్షుడు తిరుపతి జనార్దన్ రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ భత్తి శెట్టి, మండల పార్టీ నాయకులు అందరూ పాల్గొన్నారు.
.