ఎవరైనా ఇంట్లో కుక్కలను పెంచుకుంటారు.. పిల్లులను పెంచుకుంటారు. బతుకుతెరువు కోసం అయితే కోళ్లను, గొర్రెల్ని, పాలకోసం గేదెలు, ఆవుల్ని పెంచుకుంటారు. వెర్రి తలకెక్కిన వాళ్లలో కొందరు.. చిత్రవిచిత్ర జీవుల్ని పెంచుకోవడమూ మనం చూస్తుంటాం. కానీ.. పాముల్ని తేళ్లను ఎవరు పెంచుకుంటారు?
గ్యాంగ్‌స్టర్‌గా మారిన మాజీ నక్సలైట్ నయీమ్ జీవిత కథ ఇప్పుడు సెల్యులాయిడ్ చిత్రంగా రూపొందుతోంది. వశిష్టసింహా హీరగా సిఎ వరదరాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మాజీ నక్సలైట్ దామూ బాలాజీ దర్శకుడు. నక్సల్ వ్యవహారాల మీద ఎంతో పట్టున్న దర్శకుడు దామూ బాలాజీ.. నయీమ్ క థను తయారుచేసుకోవడానికి అనేకమందితో మాట్లాడి చేసిన శోధనలో.. చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. అలాంటి వాటిలో నయీమ్ ఇంట్లో పాములు, తేళ్లను పెంచేవాడు’ అనే సంగతి కూడా ఒకటి!
గ్యాంగ్‌స్టర్‌గా మారిన మాజీ నక్సలైట్ నయీమ్ తను యువకుడుగా ఉన్న రోజుల నుంచి తన ఇంట్లో పాములు తేళ్లను పెంచుతుండేవాడుట. నయీమ్ కరాటేలో బ్లాక్ బెల్ట్ అనే సంగతి, అప్పట్లో కాలేజీలో అమ్మాయిల వెంటపడే ఆకతాయి మూకలకు చెందిన కుర్రాళ్లను వెంటపడి తరిమి మరీ.. చితక్కొట్టేవాడనే సంగతి ఆదర్శిని పాఠకులకు తెలిసిందే. అలా ఉరికించి ఉరికించి కొట్టిన తర్వాత.. మరెప్పుడూ అలాంటి పనిచేయకుండా కుర్రాళ్లను భయటపెట్టడానికి నయీమ్ వద్ద మరికొన్ని టెక్నిక్స్ ఉండేవి. అతను ఇంట్లో పెంచే పాములు, తేళ్లు అందుకే ఉపయోగపడేవి.
ఆకతాయి కుర్రాళ్లను కొట్టిన తర్వాత.. వారిని మరింత భయపెట్టడానికి ఆ కుర్రాళ్ల మెడలో నయీమ్ పాముల్ని వేసేవాడట. వారి ప్యాంటు జేబుల్లో తేళ్లను వేసేవాడట. మెడలో అతను వేసే పాము విషం లేని పామే అయినప్పటికీ.. ఆ కుర్రాళ్లు పూర్తిగా బెదిరిపోయేవారట. అసలే ఎక్సెంట్రిక్ అయిన నయీమ్‌కు ఎదుటివారిలోని భయం మరింత కిక్ ఇస్తుండేది.
ఇదే అలవాటు, యువకుడిగా ఉన్నప్పుడు పొందుతూ అతనికి గ్యాంగ్‌స్టర్‌గా మారిన తర్వాత కూడా కొనసాగుతూ వచ్చింది. గ్యాంగ్‌స్టర్ రూపంలో సాగించిన దందాల్లో కూడా ఇదే పద్ధతిని పలుమార్లు అనుసరిస్తూ.. నయీమ్ అదే కిక్ పొందుతూ ఉండేవాడని అంటారు.
పీపుల్స్ వార్ నక్సలైట్లను తుదముట్టించడానికి అదనంగా నయీమ్ నేర జీవితంలో కీలక భాగం.. భూకబ్జాలు, దందాలు, సెటిల్మెంట్లు లాంటివే. భూకబ్జాల విషయంలో అసలు యజమానుల్ని బెదిరించడానికి నయీమ్ పాములను వాడే వాడని కూడా అంటారు.
ఇవి కూడా చదవండి :
Movie Review : తప్పక చూడదగిన చిత్రం క్రిష్-వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’
జనంమెచ్చిన సీఎం.. ఆడు మగాడ్రా బుజ్జీ
పవర్ స్టార్ పవన్ = గ్యాంగ్‌స్టర్ నయీమ్.. ఎలాగో తెలుసా?
అభిమానులు ఊహించని స్టెప్ వేసిన జనసేనాని
కొన్ని సందర్భాల్లో లాండ్ సెటిల్మెంట్లకు వెళ్లినప్పుడు.. నయీమ్ తన వెంట.. ఒక గాజు సీసాలో పాముల్ని కూడా తీసుకువెళ్లేవాడట. సెటిల్మెంటు చేయడానికి కూర్చుంటున్న సమయంలో.. ఎదుటివాడు.. ఆ స్థలానికి అసలు యజమాని చూస్తూ ఉండేలాగా.. ఆ సీసాలోని పామును చేత్తో బయటకు తీసి.. దానిని వారి ఎదురుగానే నేలపై వేసి.. కత్తితో దాన్ని ముక్కలుగా నరికి.. అదొక ప్రారంభ సెంటిమెంటు అన్నట్టుగా చేసి.. ఆ తర్వాత.. లాండ్ సెటిల్మెంటుకు కూర్చునేవాడుట. పామును చూడగానే భయపడిపోయే ఎదుటి వ్యక్తులు.. దాన్ని అలా ముక్కలుగా నరికిన క్రూరత్వానికి మరింతగా జడుసుకుని.. ల్యాండ్ పేపర్ల మీద ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టేసి.. మిన్నకుండిపోయే వాళ్లట.
ఇలా ఇంట్లో పాములు, తేళ్ల పెంపకం అనే కుటీర పరిశ్రమ.. గ్యాంగ్‌స్టర్ నయీమ్ కు అటు కాలేజీ రోజుల్లోను, తర్వాత డాన్ గా ఎదిగిన రోజుల్లోనూ బహుముఖాలుగా ఉపయోగపడుతూ వచ్చిందన్నమాట.
ఇవి కూడా చదవండి :
హవ్వ.. రాజగురువు చెప్పినట్టే టీటీడీ ఆడుతోందా?
ప్రజల్లో లోపమే.. ఇష్టారీతిగా ధరల పెంపుదలకు కారణమా?
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?
.
