దేవ్ దీపావళి, గురునానక్ జయంతి సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రసంగం చివర్లో ఈ విషయం చెప్పిన ప్రధాని దానికి ముందు తమ ప్రభుత్వం దేశంలో వ్యవసాయం, రైతుల సంక్షేమం కోసం ఎంత కృషి చేసిందీ, చేస్తున్నదీ వివరించారు.
ఈరోజు గురునానక్ జయంతి పవిత్ర పర్వదినం రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ, అన్ని దేశాల వారికీ ఈ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నా.
కర్తార్‌పూర్ కారిడార్ తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. ‘వీచ్ దునియా సేవిక్ కమాయియే బేసన్ పాయియే’ అనే గురునానక్ మాటలను ప్రధాని ఉదాహరించారు. అంటే ‘ప్రపంచంలో సేవా మార్గం స్వీకరించడం వల్లే జీవితం సఫలం అవుతుంది’ అని అర్థం. మన ప్రభుత్వం ఈ సేవా భావంతోనే దేశ ప్రజలందరి జీవితాలు క్షేమంగా ఉండేందుకు కృషిచేస్తోంది
ఎన్నో తరాలవారి కలలను నెరవేరాలని చూస్తున్నాం. భారత్ ఈరోజు ఆ కలలను నెరవేరే ప్రయత్నం చేస్తోంది. మిత్రులారా! నేను సుదీర్ఘమైన నా ప్రజా జీవితంలో రైతుల సవాళ్లు, వారి సమస్యలు చాలా దగ్గర నుంచి చూశాను. అనుభవించాను. అందుకే దేశం నన్ను 2014లో ప్రధాన మంత్రిగా మీ సేవకు అవకాశం ఇచ్చింది. నేను వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చాను.
చాలా మందికి తెలియని నిజం ఒకటుంది. దేశంలో వందలో 80 మంది రైతులు చిన్న సన్నకారు రైతులు! వారి దగ్గర రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉంది. మీరు ఊహించుకోవచ్చు. ఈ చిన్న రైతుల సంఖ్య 10 కోట్ల కంటే ఎక్కువగా ఉంది. వారి పూర్తి జీవితమంతా ఆ చిన్న భూమిపైనే ఆధారపడుతున్నారు. అదే వారి జీవితం.
అలా ఈ చిన్న భూమి ఆధారంగానే వారు తమ, తమ కుటుంబాల్ని పోషిస్తారు. తరతరాలు కుటుంబాల్లో జరిగే పంపిణీ ఆ భూమిని మరింత చిన్నదిగా చేస్తోంది. అందుకే చిన్న రైతులకు ఎదురవుతున్న సవాళ్లను, ఇబ్బందులను దూరం చేయడానికి మేం విత్తనాలు, బీమా, మార్కెట్, ఉపొధులు అన్నింటికీ చాలా కృషి చేశాం. ప్రభుత్వం మంచి నాణ్యమైన విత్తనాలతోపాటూ రైతులకు నిమ్కొటెడ్ యూనిట్, సాలిడ్ హెల్త్ కార్డ్, మైక్రో ఇరిగేషన్ లాంటి సౌకర్యాలు కూడా అందిస్తోంది. మేం 22 కోట్ల సాయిల్ హెల్త్ కార్డులు రైతులకు ఇచ్చాం.
ఈ శాస్త్రీయ పోకడలు, చర్యల వల్ల దేశంలో వ్యవసాయిక ఉత్పత్తి కూడా పెరిగింది. మేం పంట బీమా యోజన చాలా ప్రభావశీలంగా మార్చాం. దాని పరిధిలోకి ఎక్కువ మంది రైతులను తీసుకొచ్చాం. విపత్తులు వచ్చినపుడు వీలైనంత ఎక్కువ మంది రైతులకు పరిహారం లభించేలా కూడా పాత నిబంధలు మార్చాం. అందుకే గత నాలుగేళ్లలో ఒక్క లక్ష కోట్ల కు పైగా పరిహారం మన రైతు సోదరులకు లభించింది.
మనం చిన్న సైతులకు, కూలీలకు బీమా, పెన్షన్ సౌకర్యాలు కూడా తీసుకొచ్చాం. చిన్న రైతుల అవసరాలు పూర్తి చేయడానికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి లక్ష 62 కోట్ల రూపాయలు బదిలీ చేశాం. రైతుల శ్రమకు ప్రతిఫలంగా దిగుబడికి సరైన ధర లభించింది, దానికి కూడా చాలా చర్యలు తీసుకున్నాం.
దేశం అంతటా రూరల్ మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెంచాం. ఎంఎస్‌పీ పెంచాం. రికార్డు సంఖ్యలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. మా ప్రభుత్వం చేసిన పంట ఉత్పత్తుల కొనుగోళ్లు గత రికార్డులను బద్దలు కొట్టింది. దేశంలో వెయ్యికి పైగా మండీలను ఈ-నామ్ యోజనతో కలిపి రైతులకు తమ దిగుబడిని ఎక్కడయినా అమ్ముకునేలా వేదిక అందించాం. దీనితోపాటూ మండీల ఆధునికీకరణకు కూడా ఖర్చు చేసాం.
మిత్రులారా రైతుల సంక్షేమం కోసం వెచ్చించే కేంద్ర వ్యవసాయ బడ్జెట్ ఇంతకు ముందు కంటే ఐదు రెట్లు పెరిగింది. ప్రతి ఏటా పావు లక్ష కోట్ల రూపాయలు వ్యవసాయానికి ఖర్చు చేసాం. చిన్న రైతుల బలోపేతం చేయడానికి పది వేల అపియో కిసాన్ ఉత్పత్తుల సంఘం ప్రచారం కూడా సాగుతోంది. దీనిపై 60 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం. మైక్రో ఇరిగేషన్ వ్యవస్థలను పెంచాం. క్రాప్ లోన్స్ కూడా రెట్టింపు చేశాం, ఈ ఏడాదికి అవి 16 లక్షల కోట్లకు చేరుతాయి. పశు పోషణ, చేపల పెంపకాలు చేపట్టే రైతులు కూడా కిసాన్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనం పొందడం మొదలైంది.
అంటే మా ప్రభుత్వం అన్నిరకాల రైతుల సంక్షేమం కోసం అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తోంది. ఒక్కొక్కటిగా కొత్త నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తోంది. రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడి వారి సామాజిక స్థితి బలంగా ఉండడానికి పూర్తి నిజాయితీతో పనిచేస్తున్నాం. మిత్రులారా రైతుల పరిస్థితి మెరుగు పరచాలనే లక్ష్యంలో భాగంగా మూడు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చాం. దేశంలో రైతులను ముఖ్యంగా చిన్న రైతులకు మరింత మద్దతు అందించాల్సి ఉంది. వారి దిగుబడికి సరైన ధర, వీలైనంత ప్రత్యామ్నాయాలు లభించాలి. దీనికోసం ఎన్నో ఏళ్లుగా డిమాండులు వినిపిస్తున్నాయి. దేశ రైతులు, దేశ వ్యవసాయ నిపుణులు, ఆర్థిక వేత్తలు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. ఇంతకు ముందు కూడా చాలా ప్రభుత్వాలు దీనిపై చర్చ కూడా జరిపాయి. పార్లమంటులోను చర్చ జరిగింది. ఎంతో కసరత్తు చేసిన తర్వాత ఈ చట్టాలు తెచ్చాం. దేశంలో మూల మూలలా కోట్ల రైతులు ఎన్నో రైతు సంఘాలు దీన్ని స్వాగతించాయి. మద్దతు ఇచ్చాయి. వారందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ధన్యవాదాలు.
మిత్రులారా! మాది రైతు సంక్షేమ ప్రభుత్వం. ముఖ్యంగా చిన్న రైతుల సంక్షేమం కోసం. వ్యవసాయ సంక్షేమం కోసం దేశ సంక్షేమ కోసం గ్రామాలు, పేదల ఉజ్వల భవిష్యత్తు కోసం. నిష్టతో రైతుల పట్ల సంపూర్ణమైన నిజాయితీతో ఈ చట్టాలు తీసుకొచ్చాం.
కానీ, ఇదంతా సంపూర్ణంగా స్వచ్ఛంగా రైతుల ప్రయోజనం కోసమే చేశాం. మా ప్రయత్నాలను కొంతమంది రైతులు అర్థం చేసుకోలేకపోయారు. రైతులలో ఒక వర్గం వీటిని వ్యతిరేకిస్తున్నారు. ఇది మాకు చాలా ముఖ్యమైనది. వ్యవసాయ వేత్తలు, శాస్త్రవేత్తలు, పురోగమన ప్రగతిశీల దృక్పథం ఉన్నవారు వారికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించారు. మేం కూడా వారికి అర్థమయ్యేలా చెప్పాలని చూశాం. అనేక మార్గాల ద్వారా వ్యక్తిగత, సామూహిక చర్చలు జరిపాం. మేం రైతుల మాటలను, వారి వాదనను అర్థం చేసుకోడానికి గల అవకాశాల్లో ఏవీ విస్మరించలేదు. చట్టంలో దేనిపైన వారికి అభ్యంతరాలు ఉన్నాయో ప్రభుత్వం వాటిని మార్చడానిక కూడా సిద్ధమైంది. రెండేళ్ల వరకూ వాటిని సస్పెండ్ చేస్తామని కూడా చెప్పాం. వ్యవహారం సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. ఇవన్నీ దేశం ముందు ఉన్నాయి. అందుకే నేను వాటిపై మరిన్ని వివరాల్లోకి వెళ్లను.
క్షమించండి..
నేను క్షమించమని అడుగుతున్నా.. పవిత్ర హృదయంతోనే ఈ చట్టాలను తీసుకువచ్చాం. అయితే మా కృషిలోనే ఏదో లోపం జరిగుంటుంది. దీపం వెలుగు లాంటి సత్యం.. కొందరు రైతులు అర్థం చేసుకోలేకపోయారు. ఈరోజు గురునానక్ జన్మదినం రోజున, ఎవరినీ దోషులుగా చెప్పలేను. ఈరోజు నేను మీకు, మొత్తం దేశానికి చెప్పడానికి వచ్చాను. మేం మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని, రిపీల్ చేయాలని నిర్ణయించాం. ఈ నెల చివర్లో మొదలవుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ మూడు వ్యవసాయ చట్టాలను రిపీల్ చేయడానికి రాజ్యాంగ ప్రక్రియను పూర్తి చేస్తాం. మిత్రులారా నేను ఈరోజున అందోళన చేస్తున్న రైతు సోదరులను కోరుతున్నా. గురు పర్వ పవిత్ర రోజున మీరు మీ మీ ఇళ్లకు వెళ్లాలి. మీ పొలాలకు వెళ్లాలి. మీ కుటుంబాల మధ్యకు వెళ్లాలి. రండి ఒక కొత్త ప్రారంభం చేద్దాం. కొత్తగా ముందుకెళ్దాం.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
మిత్రులారా! ఈరోజే ప్రభుత్వం వ్యవసాయానికి సంబధించిన ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జీరో బడ్జెట్ వ్యవసాయం, అంటే సహజ వ్యవసాయం ప్రోత్సహించడానికి నిర్ణయం తీసుకుంది. దేశ పరిస్థితి దృష్టిలో పెట్టుకుని క్రాప్ పాటర్న్ శాస్త్రీయంగా మార్చడానికి పారదర్శకంగా మార్చడానికి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వ్యవసాయం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఇందులో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు. రైతులు ఉంటారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు ఉంటారు.
మిత్రులారా ! మేం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తాం. ఇక ముందు కూడా పనిచేస్తాం..
‘దేహీ శివా వర మోహి ఇహై, శుభ కరమన్ తే కబహూ న టరూ’ సిక్కులకు ఆరాధ్యుడు అయిన గురు గోవింద్ సింగ్ వ్యాఖ్యలను మోడీ ఉదాహరించారు.
‘హే దేవీ నాకు వరం ఇవ్వండి. నేను మంచి పనులు చేయకుండా ఎకప్పటికీ వెనక్కు తగ్గను’.
రైతుల కోసం, దేశం కోసం చేస్తున్నా మీ అందరి దీవెనలతో నేను కృషిలో ఎప్పుడూ లోపం చేయలేదు. ఈరోజు నమ్మకం కలిగిస్తున్నా మీకోసం మరింత కష్టపడతా మీ కలలు నెరవేరేలా, దేశం కలలు నెరవేరేలా కష్టపడతా.
మీకు చాలా ధన్యవాదాలు నమస్కారం.
.

Discussion about this post