ప్రముఖ కవి రిటైర్డ్ ఉపాధ్యాయులు SR భల్లం బ్రైన్ స్టోక్ తో హైదరాబాద్ లో చికిత్స పొందుతూ, మంగళవారం తెల్లవారుజామున స్వర్గస్తులయ్యారు. వారి అంత్యక్రియలు ఈ రోజు మ. 3.00 గం తాడేపల్లిగూడెంలో జరుగుతాయి. భల్లంకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఈయనకు ఆరు నెలల బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు న్యూరో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సిటీ న్యూరో అండ్ కార్డియో హాస్పిటల్స్ లో వారం కిందట బైపాస్ సర్జరీ కూడా జరిగింది.
ఐసీయూలో ఉన్న ఈయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కాలం చేశారు. ఈయన కుమారుడు కువైట్ లో ఉంటున్నారు.
తండ్రికి అనారోగ్యం ఉండడంతో హైదరాబాదులోనే ఉండి చికిత్స చేయిస్తున్నారు. ఒక కుమారుడు తాడేపల్లిగూడెంలో నివాసముంటున్నారు. ఉపాధ్యాయుడుగా పాలకొల్లు లంకలకోడేరు తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో పనిచేశారు.
మంచి కవి, రచయిత,, మంచి వక్త.
తెలుగు సాహితీ ప్రసంగాల్లో ఎస్ ఆర్ భల్లం దిట్ట. పల్లె నుంచి ఢిల్లీ వరకు సాహితీ ప్రసంగాల్లో ఎన్నో ప్రశంసలు పొందారు.. ఈయన కవితలు వ్యాసాలతో 20కి పైగా గ్రంధాలు ముద్రిత మయ్యాయి. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి సాహితీ ప్రసంగాలను సాహిత్యాన్ని ఎస్ ఆర్ భల్లం విస్తృతంగా ప్రచారం చేశారు.
తిరుపతిలో జరిగిన అంతర్జాతీయ తెలుగు మహాసభలలో ఆయన ప్రసంగించారు. తాడేపల్లిగూడెంలో చారిత్రక నేపథ్యం ఉన్న తెలుగు సాహితీ సమాఖ్యకు ఈయన ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు జిల్లాస్థాయి రాష్ట్రస్థాయి అవార్డులు పొందారు. అందర్నీ తనదైన భాషలో మిత్రమా అంటూ ఆప్యాయంగా పలకరించే సుకవి భల్లం భౌతికంగా దూరం కావడం పట్ల సంతాపం తెలియ చేస్తున్నాం.
.