ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవియైన మహాపురుషుడు పొట్టి శ్రీరాములని ప్రధానోపాధ్యాయులు రమణయ్య అన్నారు.
బుధవారం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మండలంలోని స్థానిక కల్లివెట్టు ఉన్నత పాఠశాలలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
ఆంధ్రరాష్ట్ర సాధన కొరకు వారు చేసిన కృషి, ఆమరణ నిరాహార దీక్ష గురించి విద్యార్థులకు వివరించారు.
ఆంధ్రుల కొరకు తొలి భాషాప్రయుక్త రాష్ట్ర సాధనకు అశువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములని నమ్మిన సిద్దాంతాలకు కట్టుబడి తెలుగు జాతి కొరకు తన ప్రాణత్యాగం చేశారని, ఆశయ సాధనలో జీవితాంతం కృషిచేసిన మహనీయుడని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం యువశ్రీ మురళి, వేణుగోపాల్, నాదెండ్ల మురళి, సురేష్ బాబు, ఒబ్బు ప్రసాద్, మోహన్ బాబు, దేవేంద్ర, జయసుధ, వాణి, మాధవీలత, రామక్క తదితరులు పాల్గొన్నారు.
.