జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గనులు భూగర్భ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
మూడవ రోజు పల్లె బాట కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం పుంగనూరు నియోజకవర్గం, పుంగనూరు మండలం, బాలాజీ కాలనీ నుండి పల్లెబాట కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు.
టిటిడి పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్, ముడా చెర్మన్ యన్. వెంకట్రా రెడ్డి యాదవ్, యం పి పి . ఏ. భాస్కర్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు జ్ఞాన ప్రసన్న లతో కలసి పల్లె బాట కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం సుగలిమిట్టా,నేతిగుట్టపల్లె,బోడేవారి పల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాలలో పర్యటించారు. గ్రామ ప్రజలు అందజేసిన సమస్యల అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి గ్రామాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. కరోన సమయం లో ఆర్థిక పరిస్థితులు బాగులేకున్నా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిలపకుండా అమలు చేయడం జరిగిందన్నారు.
ఎన్నికల ముందు చెప్పిన హామీలను అన్నింటినీ ఆమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి కి దక్కుతుందన్నారు. రాష్టం లో సచివాలయ,వలంటర్ వ్యవస్థను తీసుకురావడంతో సిబ్బంది, వలంటర్లు ప్రతి ఇంటింటికి తిరిగి ప్రభుత్వం ఆ దించే సంక్షేమ పథకాలకు అర్హులైన వారిని గుర్తించడం జరుగుతుందన్నారు.
ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేపట్టడం తో గ్రామాలలో ఎలాంటి సమస్యలు లేవని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని,గ్రామాలలో పర్యటిస్తూ ఉంటే ఎవ్వరు కూడా సమస్యలు చెప్పడం లేదని,చిన్న చిన్న సమస్యలు మాత్రమే చెప్పుతున్నారని తెలిపారు.
ఈ ప్రభుత్వం అన్ని వర్గాలకు మహిళలకు , రైతులకు, అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన వినతి పత్రాలు స్వీకరించి, వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంత్రి పర్యటనలో పెద్ద ఎత్తున మంగళ హారతులు, నీరాజనాల తో మహిళాలు మంత్రికి స్వాగతం పలికారు. మంత్రి పర్యటనతో ప్రజలకు మంత్రి కలిసే అవకాశం లభించడం తో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమం లో డ్వామా పిడి ,చంద్రశేఖర్, ఏ ఏం సి చైర్మెన్ నాగరాజ రెడ్డి, డ్వామా ఏ పిడి,చందన, యం పి డి ఓ,లక్ష్మిపతి, తహశీల్దార్ వెంకట్రాయులు,సర్పంచులు, యం పిటిసి సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
.