నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో జ్యోతి అనే ఇంటర్మీడియట్ విద్యార్థినిని ప్రేమ పేరుతో గొంతు కోసిన ఉన్మాది చెంచుకృష్ణను కఠినంగా శిక్షించాలని చిత్తూరు జిల్లా ఐద్వా కార్యదర్శి సాయిలక్ష్మి డిమాండు చేశారు.
తిరుపతి రుయా ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న జ్యోతిని సోమవారం ఆమె పరామర్శించారు. జ్యోతికి మెరుగైన వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడాలని డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా సాయిలక్ష్మి మాట్లాడుతూ… ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు పెరిగి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల కిందట రేణిగుంట మండలంలో ఆరేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఓ దుకాణదారుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. మహిళలపైన హింస, అత్యాచారాలు, లైంగిక వేదింపులు పెరుగుతున్నాయని వీటిని కట్టడి చెయడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయన్నారు. నిర్భయ చట్టం, దిశ లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా ప్రయోజనం లేదన్నారు.
ఈ చట్టాలను అమలు చేయలన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా కేసులు త్వరితగతిన విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నగర కార్యదర్శి జయంతి, ఎన్ ఎఫ్ డబ్ల్యు ఐ జిల్లా కార్యదర్శి నదియా, మంజుల తదితరులు పాల్గొన్నారు.
.

Discussion about this post