సిసింద్రీ సినిమా తో తెరంగేట్రం చేసిన అఖిల్ హీరో గా నిలబడతాడా అనే అనుమానం చాలా మంది ప్రేక్షకులలో సందేహం ఉంది. అలాగే బొమ్మరిల్లు సినిమాతో అందరినీ ఆకట్టకున్న దర్శకుడు భాస్కర్ మళ్ళీ హిట్ సినిమా ఎప్పుడు తీస్తాడా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు.
దర్శకుడు భాస్కర్ అఖిల్ హీరోగా గీత ఆర్ట్స్ బ్యానర్ లో తీసిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది.
కథ:
అమెరికా లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో హర్ష (అఖిల్) పనిచేస్తుంటాడు. ఆఫీస్ లో అందరికి తలలో నాలుకలా వుంటూ, సొంత ఇల్లు కొనుక్కున్న హర్ష కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే పేరు ఉంటుంది. పెళ్లి చేసుకోవడానికి ఇండియా వచ్చిన హర్ష కు స్టాండ్ అప్ కమెడియన్ విభావరి (పూజ హెగ్డే) పరిచయం అవుతుంది.
విభా అభ్యుదయ భావాలు చూసి అట్రాక్ట్ అయిన హర్ష తన తల్లి తండ్రులు తెచ్చిన సంబంధాలను తిరస్కరిస్తాడు. బిన్నంగా ఆలోచిస్తాడు. అమెరికా వెళ్ళిపోతాడు. తిరిగి ఇండియా వచ్చి విభా మనసును ఎలా గెలుచుకున్నాడు అనేది
మిగతా కధ.
నటవర్గం :
సినిమా లో పూజ హెగ్డే నటన ఆకట్టు కుంటుంది. అఖిల్ బానే చేశాడు. మురళి శర్మ, ప్రగతి, శ్రీనివాస అయ్యంగార్ లు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సినిమా విజయవంతం అయితే అఖిల్ కెరీర్ లో మంచి చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కినట్టు అనుకోవాలి.
సాంకేతిక వర్గం :
గోపి సుందర్ సంగీతం బావుంది. లహరాయి పాట మళ్ళీ మళ్ళీ వినేలా ఉంది. కెమెరా పనితనం కూడా బాగుంది. టెక్నికల్ గా సినిమా బావుంది.
విశ్లేషణ :
వైవాహిక జీవితం లో రొమాన్స్ అనేది చాలా ముఖ్యమైన అంశమని దర్శకుడు భాస్కర్ మనని ఆకట్టుకునేలా చెప్పాడు. సినిమాలో పాత్రధారులు ఎక్కువగా ఉన్నా, కధ చెప్పే విషయం లో దర్శకుడు కన్ఫ్యూజ్ కాకపోవడం విశేషం. కథానాయకి పాత్ర ను బలంగా రాసుకోవడం వల్ల సినిమా కు ఒక ఫ్లేవర్ వచ్చింది.
ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో కథ ను చెప్పడం బావుంది. విభా stand-up comedy పరవాలేదు.
వెన్నెల కిషోర్ హాస్యం సున్నితంగా ఉంది. ద్వితీయార్ధం వచ్చేసరికి కథ చిక్క బడుతుంది. ఓలా బైక్ సన్నివేశాలు సరదాగా ఉన్నాయి
ఆరంజ్ సినిమా లో చేసిన తప్పులు దర్శకుడు ఈ సినిమాలో చేయలేదు అందువల్ల సినిమా ఒక మంచి ఫీలింగ్ తో ముగుస్తుంది.
రొటీన్ సినిమాలకు బిన్నంగా ఉన్న బ్యాచిలర్ మంచి సందేశం ఇచ్చింది అది ఒక ఫీల్ తో…
..రాజేంద్ర ప్రసాద రెడ్డి
సీనియర్ పాత్రికేయుడు

.