టీటీడీ జేఈవో సదా భార్గవి శుక్రవారం సాయంత్రం స్విమ్స్ ఫుల్ అడిషనల్ చార్జ్ డైరెక్టర్, మరియు వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు స్వీకరించారు. స్విమ్స్ డైరెక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ వెంగమ్మ శుక్రవారం ఉద్యోగ విరమణ చేశారు. డైరెక్టర్, విసి గాకూడా కొనసాగుతున్న ఆమె స్థానంలో సదా భార్గవిని ఫుల్ అడిషనల్ చార్జ్ డైరెక్టర్, విసి గా నియమిస్తూ టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో డాక్టర్ వెంగమ్మ నుండి సదా భార్గవి బాధ్యతలు స్వీకరించారు.
Discussion about this post