బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు కరోనా భయం పట్టుకుంది. దీంతో ఆయన పధ్నాలుగు రోజుల పాటు హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.
మొన్నటివరకు లాక్ డౌన్ నిబంధనలు ఉండడంతో అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. చిత్ర పరిశ్రమ కూడా మూతపడింది. తర్వాత ఇటీవలే లాక్ డౌన్ నిబంధనలను సడలించడంతో చిత్ర పరిశ్రమలో సందడి మొదలైంది. చిత్రాల నిర్మాణం ప్రారంభమయింది. ఈ నేపధ్యంలో చిత్ర పరిశ్రమలోని పలువురిని కొవిడ్ పలుకరించింది. ఇది కొందరికి ప్రాణాంతకంగా కూడా సంభవించింది. ఇటీవలే గాన గంధర్వుడు బాలు కొవిడ్ మహమ్మారికి బలి అయిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో పలువురు ప్రముఖులు కొవిడ్ జాగ్రత్తలను పాటిస్తూ షూటింగుల్లో పాల్గొంటున్నారు. కాగా ఇప్పుడు సల్మాన్ ఖాన్ ప్రభుదేవా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటూన్న రాధే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.
Read this నెచ్చెలి వచ్చేస్తోంది.. తంబీలు అందరూ రెడీయేనా? రెండేళ్ల దాకా ఆగడం కష్టం అంటున్నారు!
ఈ నేపధ్యంలో సల్మాన్ కారు డ్రైవరుకు, ఆయన వ్యక్తిగత సిబ్బందిలో మరో ఇద్దరికి కూడా కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో వారిని వైద్య చికిత్సల నిమిత్తం ఆసుపత్రికి తరలించిన సల్మాన్, తాను కూడా కుటుంబంతోబాటు పధ్నాలుగు రోజుల పాటు హోం క్వారంటైన్ లొోకి వెళ్లనున్నట్టు తెలిసింది.
ఇటీవలే తెలుగు తెర రారాజు మెగాస్టార్ కు కూడా కొవిడ్ పాజిటివ్ వచ్చిన విషయం విదితమే. అయితే వారంరోజుల తర్వాత ఆయన జరిపించుకున్న కొవిడ్ టెస్టుల్లో నెగిటివ్ వచ్చిందని, దీని గురించి వైద్యులను సంప్రదించగా, అది పరీక్షల్లో పొరబాటు కారణంగా జరిగి వుండవచ్చని చెప్పినట్ల తెలిపారు. ఏది ఏమైనా కొవిడ్ మహమ్మారి ఎవ్వరినీ వదిలేలా లేదు.. అందరం కూడా జాగ్రత్తలను పాటిస్తూ కొవిడ్ బారిన పడకుండా ఉందాం…!
.