పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఆదిపురుష్ చిత్రం చూడాలంటే.. రెండు సంవత్సరాలు వెయిట్ చేయాలా? ఫ్యాన్స్ ఈ విషయంలో తెగ బాధపడిపోతున్నారు. చిత్రం షూటింగ్ ఇంకా మొదలు కాలేదు గానీ.. విడుదల తేదీని చిత్ర బృందం గురువారం ప్రకటించేసింది. 2022 ఆగస్టు 11న చిత్రం విడుదల ఉంటుందని అప్డేట్ ఇచ్చారు.
గురువారం ఉదయం 7.11 గంటలకు ప్రభాస్ చిత్రం విడుదల తేదీని స్వయంగా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభం అవుతుందని సమాచారం. ఒం రౌత్ దర్శక్తవం వహిస్తున్న ఇందులో ప్రభాస్ రాముడి పాత్రను పోషిస్తుండగా, బాలీవుడ్ కుచెందిన సయీఫ్ ఆలీఖాన్.. రావణాసురుడి పాత్ర చేయబోతున్నారు. టీసిరీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం దేశవ్యాప్తంగా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.
ఈ సినిమా అప్డేట్ గురించి ప్రభాస్ చేసిన ట్వీట్ పై ఆయన ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ను ప్రియమైన రాముడిగా వెండితెరపై చూడాలంటే.. రెండు సంవత్సరాలు ఎదురుచూడాలా? నా వల్ల కాదు? అంటూ అభిమానులు ట్వీట్ చేస్తున్నారు.
ఇవీ చదవండి :
పవన్‌ని దూరం పెడితే.. బీజేపీకి ఆశాభంగం తప్పదు.. నష్టమే!
కొవిడ్ భయం ఉందా.. మీకిదే శుభవార్త!
అయోధ్య నగరం ఓ అద్భుతాన్ని నమోదు చేసింది..
#Adipurush worldwide release on August 11th,2022.#Prabhas #SaifAliKhan @omraut @vfxwaala @rajeshnair06 @TSeries @RETROPHILES1 pic.twitter.com/3jUCiu4OLh
— Prabhas FC (@PrabhasRaju) November 19, 2020
.