ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ దిక్సూచి అని సత్యవేడునియోజక వర్గ జేఎసి ఛైర్మేన్ బొప్పన లలిత్ కుమార్ అన్నారు.
గురువారం సత్యవేడు తహశీల్ధార్ కార్యాలయం ఆవరణంలో ఐక్యకార్యచరణ వేదిక రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉద్యోగ,ఉపాధ్యాయ,కార్మిక,పెన్షనర్,కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల హక్కుల సాధనకై ధర్నా కార్యక్రమం చేపట్టారు.
ఈసంధర్భంగా బొప్పన లలిత్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని అన్నారు.
మూడు రోజుల్లో పిఆర్సీ ప్రకటిస్తామని చెప్పిన ప్రభుత్వం చర్చలు,కమిటీల పేరుతో ఉద్యమాన్ని నీరుగార్ఛే ప్రయత్నం చేస్తుందన్నారు.
సిఎస్ సమర్పించిన నివేదికలో ఏముందో కూడా తెలుపకుండా కాలయాపన చేయడం , ఉద్యోగుల సమస్యలపై సరైన ప్రకటన చేయకపోవడం భాధాకరమన్నారు.
ఐఆర్ 27 శాతం నుండి 14 శాతానికి వెనక్కి వెల్లే ప్రయత్నం లో ప్రభుత్వ చర్యలు చేస్తుండటం హేయమైన చర్యగా భావిస్తున్నామని తెలిపారు.
నిత్యవసర సరుకుల నుండి పెట్రోల్ వరకు ప్రతిదీ ధరలు అకాశానంటుతున్న నేపధ్యంలో ఉద్యోగుల హక్కుల సాధన అంశంలో ప్రభుత్వం దోబుచులాడుతోందని మండిపడ్డారు.
ఇకనైనా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈకార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు గురునాధం,త్యాగరాయులు,హరిబాబు,చెంగయ్య,దాము,ఎన్ఎంయు నాయకులు చెంచులయ్య,సురేష్,మూర్తి, సిఐటియు నాయకులు రమేష్, అరుణాచలం,పెన్షనర్లు లక్ష్మీనారాయణ,హరినాధుడు ,తదితరులు పాల్గోన్నారు.
.

Discussion about this post