వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన భాదిత కుటుంబాలకు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం చొరవతో సత్వర సహాయం అందింది. ఎమ్మెల్యే ఇచ్చిన ఆదేశాలు, సూచనలతో రెవిన్యూ అధికారులు స్పందించడం జరిగింది.
వరదల వల్ల మండల పరిధిలో 43మందికి సంబంధించిన గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వీరికి ఒక్కోక్కరికి రూ”3200/- ల చొప్పున ఆర్థిక సహాయం పంపిణీ చేశారు. అదే విధంగా మరోమూడు కుటుంబాలకు సంబంధించి గృహాలు పూర్తిగా దెబ్బతినడంతో వీరికి ఒక్కొక్కరికి రూ.95,100 ల చొప్పున ఆర్థిక సహాయం పంపిణీ చేశారు.
ఆపత్కాలంలో నేనున్నాను అంటూ అటు కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ, ఇటు వరదలు వస్తే నేనున్నాను మీకంటూ గ్రామాలు తిరిగి అధికారులతో సమీక్షలు చేసి భాదితులకు సత్వర సహాయం అందించడంలో తనకుతానే సాటిగా ఎమ్మెల్యే నిలిచారు.
శనివారం మల్లవారిపాళెం ఈస్ట్ పంచాయితీలో ఇళ్ళు కోల్పోయిన భాదితురాలికి రూ”95,100 లకు సంబంధించిన చెక్కును తహాశీల్ధార్ శ్రీదేవి పంపిణీ చేశారు.
ఈకార్యక్రమంలో డిప్యూటి తహాశీల్ధార్ రవిచంద్ర, విఆర్వో మధు, మల్లవారి పాళెం ఈస్ట్ సర్పంచ్ పార్వతీసన్యాసయ్య, గ్రామస్తులు జగన్, రాజయ్య తదితరులు పాల్గోన్నారు.
.