ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వై.ఆర్.హరిగోపాలరెడ్డ్డి, విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్.విజయకృష్ణారెడ్డి వారి బంధు మిత్రులతో కలసి బుధవారం సాయంత్రం శ్రీసిటీని సందర్శించారు.
శ్రీసిటీ మార్కెటింగ్ అధికారులు వారికి సాదర స్వాగతం పలికి, పారిశ్రామిక ప్రగతి, ప్రత్యేకతలు, ఉపాధి అవకాశాలను వివరించారు.
అనంతరం వీరు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి వివిధ అంశాలపై చర్చించారు.

పరిశ్రమలలో ఉపాధి అవకాశాలు, అవసరమైన నైపుణ్య శిక్షణపై తమ విద్యార్థులకు అవగాహన కల్పించాలని డాక్టర్ విజయకృష్ణారెడ్డి ఈ సందర్భంగా ఎండీని కోరారు.
దీనిపై స్పందించిన రవీంద్ర సన్నారెడ్డి, విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు తప్పక అందిస్తామన్నారు.
యూనివర్సిటీ ప్రతినిధుల సందర్శన పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన, శ్రీసిటీలో విద్యావసతులను మరింత మెరుగు పరిచేందుకు వీరి సూచనలు సలహాలు ఎంతో విలువైనదిగా భావిస్తున్నామన్నారు.
.