• About Us
  • Contact Us
  • Our Team
Sunday, August 16, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

శెభాష్ ఎంపీ గురుమూర్తి.. ఫిదా అయిన నారాయణ!

admin by admin
November 23, 2021
0
శెభాష్ ఎంపీ గురుమూర్తి.. ఫిదా అయిన నారాయణ!

ఒకరేమో.. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన గౌరవనీయ పార్లమెంటు సభ్యుడు గురుమూర్తి.. మరొకరేమో సీపీఐ పార్టీకి జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ! వీరిద్దరూ పర్యటించారు. నారాయణకు కాలు బెణికింది. నడవలేకపోయారు. ‘ఎవడ్రా అక్కడ’ అంటూ ఎంపీ గారు పరిచారకులకోసం కేక వేయలేదు. స్వయంగా తానే పూనుకున్నారు. సీపీఐ నారాయణ కాలికి అక్కడికక్కడ ఫిజియో థెరపీ చేశారు.

జనబలం తనని పెద్ద పదవిలో కూర్చోబెట్టినంత మాత్రాన తనకు కొమ్ములు రాలేదని ఎంపీ గురుమూర్తి నిరూపించుకున్నారు. మానవత్వంతో స్పందించాల్సిన చోట తనకు ఎలాంటి పదవులు, భేషజాలు అడ్డు రావని కూడా చాటుకున్నారు.

స్వతాహాగా ఫిజియో థెరపిస్టు అయిన వైసీపీ ఎంపీ గురుమూర్తి.. ఎలాంటి ఈగో లేకుండా.. సీపీఐ నారాయణ కాలిని చేతుల్లోకి తీసుకుని ఫిజియోథెరపీ చేయడం విశేషం. వారితో పాటు ఆ పర్యటనలో ఉన్న వారందరూ ఎంపీ గురుమూర్తి నిరాడంబరత్వానికి, నిష్కళంకమైన వ్యక్తిత్వానికి  ఒక్కసారిగా ఫిదా అయిపోయారు.

ఫిజియోథెరపీ చేసిన ఎంపీ

మంగళవారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లా రాయలచెరువు లీకేజీ, ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు రామచంద్రపురం మండలం కుప్పం బాదూరుకు సీపీఐ నారాయణ తమ పార్టీ నాయకులు, అధికారులు చేరుకున్నారు. అక్కడి నుండి కొండపై కిలోమీటరు మేర నడుచుకుంటూ రాయల చెరువు కట్ట వద్ద కు చేరుకున్నారు.

కొండ నుండి  దిగే సమయంలో సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ కుడి కాలికి గాయమైంది. కాలు బెణికింది. వెంటనే కాలు వాచిపోయిది. పైకి లేవలేనిస్థితిలో అక్కడే కూర్చుడిపోయారు.

అదే సమయంలో చెరువు కట్ట ను పరిశీలించేందుకు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అక్కడే కూర్చుని ఉన్న నారాయణను పలకరించారు. కాలు బెణికిన  విషయం తెలుసుకున్న తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి గాయాన్ని పరిశీలించారు.

నారాయణ దర్జాగా తన కాలును, ఎంపీ గురుమూర్తి తొడమీద పెట్టేసి సేద తీరుతూ ఉంటే.. ఎంపీ మాత్రం చాలా శ్రద్ధగా దానికి ఫిజియోథెరపీ చేసి, అనంతరం తాత్కాలికంగా కట్టు కట్టారు. తదుపరి చికిత్సకోసం కాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి  తన వాహనంలో  ఆసుపత్రికి తీసుకు వెళ్లారు.

EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి

నారాయణ పర్యటనలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, నగర కార్యదర్శి విశ్వనాధ్, కార్యవర్గ సభ్యులు ఎం. డి.ప్రసాద్, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంజుల, నదియ, విజయ,  ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉదయ్, నగర కార్యదర్శి వెంకటేష్, ఓటేరు శాఖా కార్యదర్శి పద్మనాభ రెడ్డి, అభ్యుదయ వేదిక జిల్లా కార్యవర్గ సభ్యులు విజయ్ భాస్కర్, క్రిష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

‘రామ్’ బాణమ్ : మోడీ ‘వెనక్కి’-బాబు ‘వెక్కి వెక్కి’

జగన్: మడమ తిప్పని నేతే.. మాట మార్చేస్తాడు!

 

Tags: cpi narayanamp gurumurtyphysiotherapist gurumurtytirupati mp gurumurtyఎమ్మెల్యే మధుసూదన రెడ్డితిరుపతి ఎంపీ గురుమూర్తిఫిజియోథెరపిస్ట్ గురుమూర్తిబియ్యపు మధుసూదన రెడ్డిమంత్రి మేకపాటిసీపీఐ నారాయణ
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply