సభ్య సమాజం తలదించుకునే దుర్ఘటన ఇది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు అభం శుభం తెలియని ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించాడు. ఆ బాలికను తీవ్ర చిత్ర హింసలకు గురి చేశాడు.
బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇందుకు సబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల బాలిక శ్రీరామనర్ కాలనీ ప్రాంతంలో గల ప్రెవేటు పాఠశాలలో చదువుతోంది. పాఠశాల వదలిన తరువాత ఇంటికి వెళ్లింది. పుస్తకాలు ఇంటిలో పెట్టి ఆడుకోవడానికి సమీపంలోని ఓ ఇంటి వద్దకు వెళ్లింది.
ఆ ఇంట్లో ఉన్న 40 ఏళ్ల వ్యక్తి బాలికను మచ్చిక చేసుకుని.. తన ఇంటి లోపలకు తీసుకెళ్లాడు. ఆ తరువాత ఆ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఎక్కడ పడితే అక్కడ కొరికాడు. దీంతో ఆ బాలిక కేకలు వేసింది.
ఈ అరుపులు విన్న బాలిక తల్లి అక్కడకు వెళ్లింది. తన కుమార్తెపై ఆ కామాంధుడు అత్యాచార యత్నం చేస్తున్నట్లు గుర్తించింది. పరుగు పరుగున అక్కడకు పోయి… కామాంధునికి దేహ శుద్ది చేసి తన బిడ్డను కాపాడుకుంది.
అనంతరం శ్రీకాళహస్తి ఒకటవ పట్టణ పోలీసులకు బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
.