శ్రీకాళహస్తి టౌన్లో ఈ నెల 26న జరిగే జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో గోడ పత్రికలు ఆవిష్కరించడం జరిగింది.
భారత స్వాతంత్ర పోరాటంలో కోట్లాది మంది కార్మికులు నాయకత్వం వహించే స్వాతంత్ర సమరంలో అగ్రభాగాన నిలిచిన ఏకైక జాతీయ కార్మిక సంస్థ ఏఐటియుసి అని కొనియాడారు.
ఈ మహాసభలకు జిల్లా రాష్ట్ర నాయకులు హాజరు అవుతారని పెద్ద సంఖ్యలో ప్రతినిధులు పాల్గొంటారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి ఈ జిల్లా మహాసభ తోడ్పడుతుందని వక్తలు అన్నారు.
భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవాలని పిలుపు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ కార్యదర్శి జన మాల గురవయ్య నియోజకవర్గ బాధ్యులు రాధాకృష్ణ నియోజకవర్గ కార్యదర్శి వై ఎస్ మణి ,బోడి రెడ్డి మోహన్ రెడ్డి, కార్తీక్ ,రజాక్ ,అయ్యప్ప, లాజర్ ,రాధాకృష్ణ ,తదితరులు పాల్గొన్నారు.
.