జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణం కొత్తపేటలో గల పురపాలక పాఠశాలలో ఏ.పి.ఎస్.పి.డి.సి.ఎల్ వారి ఆధ్వర్యంలో సోమవారం విద్యుత్ పొదుపు వినియోగంపై అవగాహన సదస్సు జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న విద్యుత్ శాఖ డీఈ సతీష్ మాట్లాడుతూ చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే విద్యుత్తు పొదుపు సాధ్యమే అన్నారు. విద్యుత్ పొదుపు అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.
అవసరానికి మించి విద్యుత్ వినియోగం వల్ల ఆర్థికంగా నష్టం వాటిల్లడంతో పాటు భూతాపం పెరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఇవాళ్టి వేస్టేజ్ రేపటి షార్టేజ్ అవుతుందన్నారు. ఇంధన పొదుపుపై విద్యార్థి దశ నుంచే అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
వినియోగదారులు చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే విద్యుత్తు పొదుపు సాధ్యమేనని ఆయన చెప్పారు. విద్యుత్ పొదుపుతోనే ఇంధనం ఆదా అవుతుంది. వినియోగదారులు తక్కువ కరెంటు తీసుకునే ఎల్‌ఈడీ బల్బులను వినియోగించుకోవాలి.
‘నేటి సంకల్పం రేపటి వెలుగుల సహకారం అవుతుంది’ అవసరం లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు తప్పనిసరిగా ఆఫ్ చేయాలన్నారు.. విద్యుత్తు వృథాను నివారించటం ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలి.
చిన్న నిర్లక్ష్యాల కారణంగా ఎక్కువగా విద్యుత్తు వృథా అవుతుంటుంది. భావితరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇంధన వాడకాన్ని తగ్గించాలన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏ.ఈ నాగరాజు, గ్రామీణ ఏ.ఈ లు లైన్ ఇన్స్పెక్టర్, మండలంలోని లైన్ మ్యాన్ లు సిబ్బంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈశ్వరరెడ్డి, బోధన, బోధనేతర సిబ్బంది. విద్యార్థులు పాల్గొన్నారు.
.