క్రీడలతో నే విద్యార్థులకు మానసిక ఉల్లాసం కలుగుతుందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డి అన్నారు.
రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న ఏపీ సీఎం కప్ క్రీడలను పవిత్ర మంగళవారం ప్రారంభించారు.
విద్యార్థులతో కలిసి షటిల్, వాలీబాల్, కబ్బడి ఆడారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పవిత్ర మాట్లాడుతూ విద్యార్థులతో కలిసి క్రీడల్లో పాల్గొనటం ఆనందంగా ఉందని అన్నారు.
చదువులతో పాటు క్రీడలలో కూడా ప్రోత్సహించాలని ఉపాధ్యాయులను తల్లిదండ్రులను కోరారు.
ఈ కార్యక్రమంలో మండల అధికారులు, వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
.