శ్రీకాళహస్తి టౌన్ 9వ వార్డు వాలంటీర్ ఉమామహేశ్వరి చావుకు కారణమైన టువంటి కానిస్టేబుల్ ప్రసాద్ ను వెంటనే అరెస్ట్ చేయాలని సిపిఐ పార్టీ, ప్రజా సంఘాల నాయకులు స్థానిక డివై ఎస్ పి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య మాట్లాడుతూ ఈనెల రెండవ తేదీన కేసు ఎఫ్ఐఆర్ అయ్యి ఈరోజు కి నాలుగు రోజులు కావస్తున్నా ఇప్పటివరకు వారిని అరెస్టు చేయకపోవడం దారుణం అన్నారు.
కానిస్టేబుల్ ప్రసాద్ కి ధనబలం, రాజకీయ బలం, పోలీసు బలం పుష్కలంగా ఉండటం వల్ల ఇప్పటివరకు అతన్ని అరెస్టు చేయడంలేదని ఆరోపించారు.
ఇప్పటికైనా స్థానిక డిఎస్పీ గారు చొరవ తీసుకుని అతనిని వెంటనే అరెస్టు చేయాలని ఉమామహేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యానాది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చందమామల కోటయ్య, సిపిఐ నాయకులు రోడ్డ గోపి, ధనంజయ ,మోహన్ ,వరలక్ష్మి ,తదితరులు పాల్గొన్నారు.
.