శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు జనసేన నూతన కార్యవర్గాన్ని నియమిస్తున్నట్లు ఆ పార్టీ నియోజకవర్గం ఇన్ చార్జి వినుత కోటా చెప్పారు. ఈ మేరకు ఆమె శుక్రవారం శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆమోదం తో… చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ సూచనలతో శ్రీకాళహస్తి నియోజకవర్గం లోని నాలుగు మండలాలు, రెండు పట్టణాలకు అధ్యక్షులను నియమిస్తున్నట్లు ఆమె చెప్పారు. నూతన కార్యవర్గానికి నియామక పత్రాలు కూడా వినుత అందజేశారు. శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు గా దండి రాఘవయ్య, శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులుగా రామానాయుడు భవాని శంకర్, ఏర్పేడు మండల అధ్యక్షులుగా రామిశెట్టి కిరణ్ కుమార్, తొట్టంబేడు మండల అధ్యక్షులుగా కొప్పల గోపి, రేణిగుంట మండల అధ్యక్షులుగా తిమ్మా రెడ్డి మునికుమార్, .రేణిగుంట పట్టణ అధ్యక్షులుగా పి. విజయ్ ఆనంద్ రావును నియమించారు. ఇక
శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యదర్శులుగా పాలూరు మునికుమార్, జంగం మనోజ్ కుమార్, కావలి శివకుమార్ నియమించారు.
.