శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో ఈ నెల 23వ తేదీ గురువారం ఉదయం 10గంటలకు జేకేసీ ఆధ్వర్యంలో ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ నాగరాజానాయుడు తెలిపారు.
ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రైజింగ్ స్టార్స్ మొబైల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ లో ఉద్యోగాల కల్పనకు ఈ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
18-32 ఏళ్ల మధ్య వయసు కలిగి… పది లేదా ఇంటర్, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయిన యువతులు ఈ ఉద్యోగ మేళాకు అర్హులని ఆయన తెలిపారు.
ఆసక్తి గల వారు తమ 10వ తరగతి సర్టిఫెకెట్ ఒరిజినల్, ఆధార్ కార్డు, బ్యాంకు పాసుపుస్తకం, నాలుగు పాస్ పోర్టు సైజు ఫోటోలు, జిరాక్స్ కాపీలు తీసుకుని హాజరు కావాలని ఆయన కోరారు.
ఈ అవకాశాన్ని నిరుద్యోగులు వినియోగించుకోవాలని నాగరాజానాయుడు విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలకు 9848898024 లేదా 9440502338 ఫోన్ నంబర్లలోసంప్రదించాలని కోరారు.
.