రాష్ట్ర స్థాయి టెన్నిస్ పోటీలో శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంజీఎం పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు.
విజయవాడలో ఇటీవల టెన్నిస్ పోటీలు జరిగాయి. ఇందులో ఎంజీఎం స్కూల్ విద్యార్థులు మహమ్మద్ సిద్దిక్, ఉమర్ అక్మల్ అనే విద్యార్థులు ప్రతిభ కనబరచి బహుమతులు కైవసం చేసుకున్నారు.
ఈ విద్యార్థులను శనివారం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎం జి ఎం గ్రూప్స్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్ అభినందించారు.
అండర్-16 విభాగంలో ఫైనల్ విన్నర్ గా సెలెక్ట్ అయిన శిద్దిక్ బంగారు పతకం అందించారు. అండర్- 14 విభాగంలో ఉమర్ అక్మల్ సిల్వర్ మెడల్ అందించారు.
ఈ కార్యక్రమంలో ఎంజీఎం స్కూల్ హెడ్మాస్టర్ ముని రత్నం నాయుడు, పీఈటీ గురవయ్య తదితరులు పాల్గొన్నారు.
.