శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ జ్ఞానప్రసూనాంబ నర్సింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని సిపిఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఏఐటీయూసీ, సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఓ పెద్దిరాజు కి వివిధ సమస్యలతో కూడినటువంటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఐ పార్టీ ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య మాట్లాడుతూ 76 మంది చదువుతున్నటువంటి ఈ కళాశాలకి గత ఎనిమిది నెలల నుంచి పూర్తిస్థాయిలో అధ్యాపకులు గాని, ప్రిన్సిపాల్ గాని లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
ఈ సంవత్సరం న్యూ అడ్మిషన్స్ 21 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి అధ్యాపకులు లేక ప్రిన్సిపాల్ లేక అయోమయ పరిస్థితుల్లో విద్యార్థులు బాధపడుతున్నారన్నారు.
ఇప్పటికైనా నర్సింగ్ కళాశాల సమస్యలపైన ఎండోమెంట్ కమిషనర్ స్పందించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు.
ఇప్పటికే శ్రీకాళహస్తి పట్టణానికి తలమానికమైన ఇంజనీరింగ్ కళాశాల స్కిట్ తరలిపోయింది. కనీసం పేద విద్యార్థులు చదువు ఉన్నటువంటి నర్సింగ్ కళాశాల విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎస్ ఎఫ్ ఏరియా కార్యదర్శి సంగన పల్లి సురేష్ ,పట్టణ అధ్యక్షుడు ముని చందు, ఏఐవైఎఫ్ ఏరియా కార్యదర్శి మల్లికార్జున్ ,సిపిఐ పట్టణ నాయకులు గోపి, ఏఐటియుసి ఏరియా కార్యదర్శి వై యస్ మణి అధ్యక్షులు అయ్యప్ప, స్వీట్ వండర్స్ కార్యదర్శి నాజర్ ,పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.
.