చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో వెలసిన జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని గురువారం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి, హైదరాబాదు జిల్లాల ఉపాధ్యాయుల శాసనపమండలి సభ్యులు కాటేరి జనార్థనరెడ్ఢి దర్శించుకున్నారు.
ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు ఈయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు.
స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల వనరుల కేంద్రం ప్రోటోకాల్ ఉద్యోగి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
.