ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్-257 (APTF-257) 2022వ సంవత్సర నూతన క్యాలెండర్లు, డైరీలను గురువారం శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్ఢి ఆవిష్కరించారు.
శ్రీకాళహస్తి పట్టణంలోని డిగ్రీ కళాశాల ఆవరణ లో ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధు మాట్లాడుతూ… ఏపీటీఎఫ్ నేతలు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో ముందు వరుసలో ఉంటారన్నారు.
అదేవిధంగా సామాజిక సేవలో కూడా వీరు ముందుంటారని ప్రశంసించారు. ఇక వైసీపీ జిల్లా అధికారప్రతినిది అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ ఏపీటీఎఫ్ స్థాపించి 75 వసంతాలు పూర్తి చేసుకుందన్నారు.
ఇంత చరిత్ర కలిగిన ఏకైక ఉపాధ్యాయ సంఘం మన రాష్ట్రంలో ఇదేనన్నారు. ఈ సంఘంలో సభ్యులుగా ఉండడం గర్వకారణమన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ శ్రీకాళహస్తి పట్టణ శాఖ అధ్యక్షులు కె.వెంకటాద్రి, రాష్ట్ర కౌన్సిలర్లు దావాల జయరాం, ప్రధానోపాధ్యాయులు అక్తర్ ఆలీఖాన్, గౌరవ సలహాదారు G.సుధాకర్, ఉపాధ్యాయులు పీడీ చంద్రశేఖర్, కె.సురేషబాబు, సి. దిలీపకుమార్, ఆర్. గోపాల్ తదితరలు పాల్గొన్నారు.
.