తంబళ్లపల్లె మండల కేంద్రంలో గల ఏపీ ఆదర్శ పాఠశాలలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు.
విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత చాలా అవసరమని వైద్యులు ఈ సందర్భంగా చెప్పారు.
ఈ కార్యక్రమంలో కోసువారిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు నిరంజన్ కుమార్ రెడ్డి, వైద్య సిబ్బంది కృష్ణానాయక్, పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్.హేమంత్ కుమార్, బాలికల వసతి గృహ: వార్డెన్ బి.బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.
కాగా ఈ శిబిరం పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ ఎస్. సిలార్ సాహెబ్ (సలీం) ఆధ్వర్యంలో నిర్వహించినట్లు పాఠశాల వారు తెలియజేశారు.
.