తిరుమల తిరుపతి దేవస్థానాల వారు.. తిరుమలేశుని 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను డిసెంబరు 24 వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చెయ్యనున్నారు. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటనలో తెలియజేసింది.
రోజుకి 20 వేల మంది భక్తులను అనుమతించే విధంగా 6 లక్షల 20 వేల టిక్కెట్లను టిటిడి ఆన్‌లైన్లో విడుదల చెయ్యనుంది. జనవరి నెలకు సంబంధించి సర్వదర్శనం టోకెన్లు 5 వేలు ఆఫ్ లైన్‌లోను, 5 వేలు ఆన్ లైన్‌లో జారీ చెయ్యనున్నారు.
25వ తేది ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టోకెన్లు ఆన్ లైన్ లో విడుదల చెయ్యనున్నారు. రోజుకి 5 వేల చొప్పున మొత్తం లక్షా 55 వేల టిక్కెట్లు విడుదల చేస్తారు. జనవరి నెలకు సంబంధించి ప్రతి నిత్యం 5 వేల టోకేన్లు తిరుపతిలో జారీ చేస్తారు.
డిసెంబరు 31వ తేది నుంచి తిరుపతిలో ఆఫ్ లైన్ లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తారు.
తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. ధనుర్మాసం స్వామివారికి విశిష్టమైన మాసం కావడంతో భక్తులు కూడాపోటెత్తుతున్నారు. నూతన సంవత్సరాదితోపాటు వైకుంఠ ఏకాదశి, సంక్రాతి సెలవులు పూర్తయ్యే వరకు భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
.

Discussion about this post