ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పుడు సరికొత్త రాజగురువు తయారయ్యారు. ప్రభుత్వాధినేత కూడా తరచుగా.. వెళ్లి.. ఆయన పాదాల చెంత పద్మాసనుడై కూర్చుని హితవాక్యములు, సలహాలు విని, ప్రణమిల్లి ఆశీస్సులు అందుకుని వస్తారు. సదరు రాజగురువు.. ప్రభుత్వాన్ని ఏమేరకు నడిపిస్తున్నారో తెలియదు గానీ.. వేంకటేశ్వరుడు కొలువైన తిరుమల వ్యవహారాలను, టీటీడీ ని మాత్రం తన కనుసన్నల్లోనే నడిపిస్తున్నారు.
ఆ రాజగురువు మరెవ్వరో కాదు.. విశాఖ కేంద్రంగా ఆధ్యాత్మిక, రాజకీయ వ్యవహారాలను నడుపుతున్న స్వరూపానంద.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ వ్యవహారాలు అన్నీ.. వైఖానస ఆగమోక్తంగా జీయర్‌ల పర్యవేక్షణలో జరుగుతుంటాయి. వైఖానస ఆగమాన్ని మీరి ఏ నిర్ణయం తీసుకోరు. పూజాదికాల విషయంలో ఆగమోక్తంగానే జరుగుతాయి గానీ.. భక్తుల సేవలు, ఇతర పరిపాలన వ్యవహారాలకు సంబంధించి.. ఇప్పుడు విశాఖ స్వరూపానంద మార్గదర్శి పాత్రను, రాజగురువు పాత్రను పోషిస్తున్నారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన ప్రజలను తిరుమలకు తీసుకువచ్చి ఉచితంగా దర్శనం చేయించి పంపాలనే ఆలోచనను టీటీడీ అమల్లో పెట్టింది. 13 జిల్లాలనుంచి ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల నుంచి రోజుకు వెయ్యిమందిని తీసుకువచ్చి తిరుమలలో దర్శనం చేయించి పంపాలనేది ప్రణాళిక. వారికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం దగ్గరినుంచి సమస్తం టీటీడీ భరిస్తుంది. ఒక్కోజిల్లాకు పది బస్సులు నడపాలని, ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలనుంచి ఇరవై బస్సులైనా నడపవచ్చునని ప్లాన్ చేశారు.
అయితే ఈ కార్యక్రమానికి అనుకున్నంతగా స్పందన మాత్రం లేదు. తొలిరోజు చిత్తూరు కడప జిల్లాలనుంచి బస్సులు ఏర్పాటు చేస్తే 350 మంది మాత్రమే వచ్చారు.
ఇవి కూడా చదవండి :
పవర్ స్టార్ పవన్ = గ్యాంగ్‌స్టర్ నయీమ్.. ఎలాగో తెలుసా?
అభిమానులు ఊహించని స్టెప్ వేసిన జనసేనాని
ఒకవైపు తిరుమలలో అతి పరిమితంగా భక్తులను అనుమతిస్తున్న ఈ సీజనులోనే రోజుకు వెయ్యిమందిని ఇలా తీసుకురావాలా అనే ప్రశ్న ఒకవైపు ఉంది. దర్శనార్థం వచ్చే భక్తులు.. తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే దారి కూడా లేక.. దర్శనం లేకపోయినా.. అఖిలాండం వద్ద టెంకాయ కొట్టుకుని తిరిగి వెళ్లిపోతాం అని వేడుకుంటున్నా.. కొండ మీదికి రానివ్వడం లేదు. దర్శనం టికెట్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఏడుపులు వేదనలతో భక్తులు తిరిగి వెళుతున్నారు.
అయితే సరిగ్గా ఈ రద్దీ సీజనులోనే ఏజన్సీల నుంచి రోజుకు వెయ్యి మందిని తీసుకురావాలనే ప్లాన్ ఆచరణలో పెట్టడం విమర్శలకు గురవుతోంది.
రాజగురువు సూచన మేరకే..
టీటీడీ వ్యవహారాలను తన కనుసన్నలతో నిర్దేశిస్తున్న విశాఖ స్వరూపానంద ఆదేశాల మేరకే ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలుస్తోంది. స్వరూపానంద గతంలో విశాఖ ప్రాంత ఏజన్సీ ఏరియాల నుంచి భక్తులను తిరుమలకు తీసుకువచ్చి దర్శనం చేయించేవారు. తాను అప్పట్లో సొంతంగా చేపడుతుండిన కార్యక్రమాన్ని ఇప్పుడు టీటీడీ ఖాతాలో అన్నిజిల్లాలకు వర్తింపజేసి నిర్వహిస్తున్నారనే విమర్శ వినిపిస్తోంది.
ఇవి కూడా చదవండి :
satire : అర్ధరాత్రి గునపం దరువులు
ప్రజల్లో లోపమే.. ఇష్టారీతిగా ధరల పెంపుదలకు కారణమా?
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?
ఇదొక్కటే కాకుండా.. టీటీడీ బోర్డు అనేక నిర్ణయాల వెనుక స్వరూపానంద సూచనలే ఉన్నాయని కూడా పలువురు అంటున్నారు. సాంప్రదాయ భోజనం ను హఠాత్తుగా తొలగించినా, సర్వదర్శనం తిరిగి ప్రారంభించినా అన్నీ స్వరూపానంద సూచనల మేరకే జరుగుతున్నాయని అంటున్నారు.
టీటీడీ పాలకులకు స్వరూపానంద ప్రీత్యర్థం పనిచేయడం ఇష్టమైన పని కావొచ్చు. కానీ.. బ్రహ్మోత్సవాల సమయం కాకుండా.. రద్దీ తక్కువ ఉండే ఇతర రోజులలో ఇలాంటి ప్రయోగాలు చేస్తే ఎవ్వరూ పెద్దగా నిందించరు. కానీ.. ఒకవైపు దేవుడి దర్శనం కోసం ఎంతెంతో దూర ప్రాంతాలనుంచి వచ్చే భక్తులు.. ఆ భాగ్యానికి నోచుకోక విలపిస్తుండగా.. రవాణా సహా సకల ఏర్పాట్లు కల్పిస్తూ కొన్ని ప్రాంతాల వారిని పనిగట్టుకుని తీసుకురావడం దర్శనం చేయించి పంపడం ఏమిటో.. అది మంచి పనే అనుకున్నప్పటికీ.. ఈ సీజనులోనే ఎందుకు చేయాలో అర్థం కావడం లేదు.
పెరటాశి నెలలోనే ఈదర్శనాలు కూడా పెట్టాలా..
తమిళులకు అత్యంత ముఖ్యమైన పెరటాశి మాసం ఇప్పుడు నడుస్తోంది. ఈ మాసంలో తమిళనాడు రాష్ట్రం నుంచి వందలాది కిల్లో మీటర్ల నుంచి భక్తులు తిరుమలకు నడిచి వచ్చి స్వామి వారికి మొక్కులు చెల్లించుకొని… శ్రీవారిని దర్శించుకుంటారు. కానీ ప్రస్తుతం దర్శన టిక్కెట్లు వున్న వారికీ మాత్రమే తిరుమలకు అనుమతి వుండడంతో వారిని అలిపిరి వద్దే నిలిపేస్తున్నారు. ఇలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు స్వామి దర్శన భాగ్యం దక్కక వెనుదిరుగుతున్నారు.
ఏజెన్సీ ప్రాంతాలలో భక్తులను ప్రత్యేకంగా టీటీడీ ఏర్పాట్లతో పిలిపించి దర్శనం చేయించడం మంచి కార్యమే! అయితే అందుకు ఎంచుకున్న సమయమే విమర్శలకు గురవుతోంది. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి వందలాది కిల్లో మీటర్ల నడ్చి వచ్చే భక్తులకు టీటీడీ దర్శనం భాగ్యం కల్పించవచ్చు కదా అనేది కూడా చర్చనీయాంశం అవుతోంది. వీరిని గుర్తించడం, ఏర్పాట్లు చేయడం కొంత క్లిష్టమే అయినప్పటికీ.. టీటీడీ ఏదో ఒక ఆలోచన చేస్తే.. దేవదేవుడి దర్శనార్థం వచ్చిన భక్తులు, నిరాశతో వెనుతిరగకుండా ఉంటారు.
.

Discussion about this post