గాంధీ జయంతి రోజు నేను ఈ సినిమా చూడటం యాదృచ్చికం కావచ్చు. అయితే వలసవాదం మీద మహోన్నత పోరాటం చేసిన మహాత్మా గాంధీ కి గొప్ప నివాళి అర్పించారు దర్శకుడు దేవా కట్టా.
అమెరికాలో చదువుకొని, ఉద్యోగం చేస్తూ, సినిమా మీద అభిమానంతో స్వదేశం వచ్చిన దర్శకుడు దేవా కట్టా. ప్రస్థానం అనే పొలిటికల్ థ్రిల్లర్‌ను తీశాడు. అయితే ఆ సినిమా గొప్పగా రాలేదు. విడవకుండా అదే జోనర్ లో రిపబ్లిక్ సినిమాను గొప్పగా తీశాడు. ప్రేక్షకులు ఆలోచించేలా చేశాడు. కంటతడి పెట్టించాడు.
సినిమా లో కథ చాలా సింపుల్. అయితే కథనం భిన్నంగా సాగుతుంది. కొల్లేరు సరస్సు ప్రాంతంలో ఏళ్ల తరబడి అక్రమంగా సాగుతున్న చేపల పెంపకం అంశాన్ని చక్కగా, నిజాయితీతో తెరక్కించాడు. పాత్రల చిత్రణ బావుంది.
ఇటువంటి సోషల్ సబ్జెక్ట్‌లో నటించినందుకు హీరో సాయి ధరమ్ తేజ్‌ను ముందుగా అభినందించాలి. కలెక్టర్‌గా జీవించాడు. రమ్య కృష్ణ, జగపతిబాబు, ఐశ్వర్య రాజేష్, శ్రీనివాస్ అయ్యంగార్ ల నటన ఆకట్టుకుంటుంది. దేవా కట్టా, కిరణ్ కుమార్ ల స్క్రీన్ ప్లే బావుంది.
ఇదీ చదవండి :
లొకేషన్ లో కన్నీళ్లు పెట్టుకున్న సమంత్ రూత్‌ప్రభు
ఉన్నవి మూడు పాటలు. మణి శర్మ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. నేపథ్య సంగీతం బావుంది. దర్శకుడు దేవా కట్టా రాసిన సంభాషణలు గొప్పగా ఉన్నాయి. పేలాయి. ఆలోచింపజేస్తాయి. కొల్లేరు సరస్సు ప్రత్యక్షం గా చూసిన అనుభూతి కలిగింది నాకు.
గత పదేళ్ళలో తెలుగులో వచ్చిన పొలిటికల్ డ్రామాలలో రిపబ్లిక్ ప్రత్యేకంగా నిలుస్తుంది.
లీడర్, కృష్ణం వందే జగద్గురుం సినిమాలోలా ఇందులో కమర్షియల్ హంగులు లేవు. లొకేషన్స్ సహజంగా ఉన్నాయి. సినిమా బోర్ కొట్టదు. ఇబ్బంది పెట్టే ఫ్లాష్ బ్యాక్ లు లేవు. బూటకపు ఎన్‌కౌంటర్స్ ని తప్పు పట్టిన విధానం బావుంది. టెక్నికల్‌గా కూడా సినిమా బావుంది.
చివర్లో హీరో పాత్రకు ఇచ్చిన ముగింపు కొంతమంది ప్రేక్షకులకు నచ్చక పోవచ్చు. కానీ రాజకీయ వ్యవస్థ మీద చక్కగా చర్చించి, మనని ఆలోచింపజేసే సినిమాను దేవా కట్టా తీశాడు. కంట తడి పెట్టిస్తాడు.
రిపబ్లిక్ సినిమా చూస్తుంటే లవ్ అగ్రవాల్ పశ్చిమ గోదావరి కలెక్టర్‌గా కొల్లేరు లోని అక్రమ చేపల చెరువులను ధ్వంసం చేసిన సంఘటనలు నాకు గుర్తుకు వచ్చాయి.
వర్తమాన రాజకీయాలను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ‘రిపబ్లిక్’. ప్రజాస్వామ్యం పట్ల దర్శకుడు దేవ కట్టా కు ఉన్న నిబద్దత, నిజాయితీతో తీయడం మనకు గుర్తుండిపోతాయి.

ఇవి కూడా చదవండి :
బద్వేలును వదిలించుకోవాలని మిత్రులిద్దరిలో ఆరాటం
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
రోజా సీటు కింద పెద్దిరెడ్డి కుంపటి రాజేస్తున్నారా
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
పవన్ కల్యాణ్ పై పోసాని ఆగ్రహం న్యాయమే
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
పవన్ కల్యాణ్ ఒంటరి అయిపోయాడా?
అవినీతి కేసుల్లో ఉన్న ఐఏఎస్ శ్రీలక్ష్మి .. తర్వాత ఎపీ సీఎస్ అవుతారా?
బద్వేలునుంచి జారుకోవడానికి పోటీపడుతున్న జనసేన-బీజేపీ
.