బద్వేలు ఉపఎన్నిక విషయంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు రాజకీయ విలువలను పాటిస్తూ బరిలోకి దిగబోవడం లేదని ఆల్రెడీ ప్రకటించేశాయి. సిటింగ్ అభ్యర్థి మరణించిన నేపథ్యంలో జరుగుతున్న ఉప ఎన్నిక గనుక.. ఆ రకంగా తాము విపరీతమైన ఔదార్యం ప్రదర్శించినట్టుగా వారు కనిపించారు. అయితే వీరు కాకుండా మరొక పార్టీ మిగిలి ఉంది- అదే బీజేపీ! ఈ రెండు పార్టీలు పోటీనుంచి తప్పుకోవడం వెనుక.. ఈ త్రిమూర్తులూ కలిసి పన్నుతున్న వ్యూహం వేరే అనే మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
బద్వేలు ఉప ఎన్నిక విషయంలో పోటీ చేయడం లేదని జనసేన, టీడీపీ మాత్రమే ప్రకటించాయి. బీజేపీ ఇంకా తమ నిర్ణయం చెప్పలేదు. ఇక్కడ పోటీ గురించి, కొన్ని రోజుల కిందట పవన్ తో సుదీర్ఘంగా మంతనాలు సాగించిన పార్టీ- పవన్ తన అభిప్రాయం చెప్పేసిన తర్వాత కూడా.. ఇంకా నిర్ణయం ప్రకటించడం ఒక వ్యూహం. ప్రస్తుతానికి తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. బీజేపీ అభ్యర్థిని పోటీకి దింపుతుంది. గెలుపోటములతో నిమిత్తం లేకుండా ఎన్నికల్లో పాల్గొనాలనే ప్రజాస్వామ్య మౌలిక స్ఫూర్తిని కాపాడడానికి మాత్రం కాదు. అలా పోటీ చేయడం ద్వారా.. వారు లక్ష్యిస్తున్నది మాత్రం వేరే ఉంది. ఆ లక్ష్యం- ఒక్క బీజేపీది కాదు. మొత్తం మూడు పార్టీలకు ఉన్న సమష్టి లక్ష్యం.
రాష్ట్రంలో రోడ్లు బాగానే లేవని, సామాన్యుడికి టచ్ అయ్యేలాగా.. జనసేన ఉద్యమాలు నడపవచ్చు గాక, టీడీపీ నిందలు వేయవచ్చు గాక.. కానీ, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సర్కారు చేపడుతున్న ప్రజాకర్షక పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ఉధృతిలో 2024 నాటికి వైఎస్సార్ సీపీని ఓడించడం సాధ్యమయ్యే పనేనా అనే మీమాంస అన్ని రాజకీయా పార్టీల్లోనూ ఉంది. ఓడించాలంటే ఎలా.. విడివిడిగా తలపడితే జగన్ ప్రాభవాన్ని అడ్డుకోవడం కష్టమనే భయమూ కొంత ఉందనిపిస్తోంది. అలాంటప్పుడు ముగ్గురూ కలిసి బరిలోకి దిగితే ఎలా ఉంటుంది? అని లిట్మస్ టెస్ట్ లా క్రాస్ చెక్ చేసుకోవడానికి ఈ బద్వేలు ఎన్నికను వారు వాడుకోవాలని అనుకుంటున్నారు.
టీడీపీ, 2014లో, బీజేపీ, జనసేనలతో కలిసే బరిలోకి దిగింది. అందరి ఓట్లనూ పోగేసుకుని అధికారంలోకి వచ్చింది. 2019 పరాభవం అందరికీ తెలిసిందే. తెలుగుదేశానికి, చంద్రబాబునాయుడుకు ఎంతో అనుకూలంగా తొలినుంచి వ్యవహరించిన.. పవన్ కల్యాణ్.. బీజేపీతో పొత్తు పెట్టుకున్న రోజుల్లోనే.. భవిష్యత్తులో తిరిగి టీడీపీతో ఆ పార్టీని సమన్వయం చేయడానికి ఆయనది దూత పాత్ర అవుతుందని చాలా మంది అంచనా వేశారు. ఇప్పుడు అదే నిజమనిపించేలా.. పరిణామాలు కనిపిస్తున్నాయి.
బద్వేలు ఉప ఎన్నిక నుంచి.. తెలుగుదేశం, జనసేన తప్పుకున్నాయి. బీజేపీ ఇంకా నిర్ణయం ప్రకటించలేదు. సాధారణంగా అయితే.. జనసేన వారి మిత్రపక్షం గనుక.. పవన్ ప్రకటన అంటే.. ఇద్దరూ కలిసి ప్రకటించినట్టుగానే భావించాలి. కానీ ఇద్దరి మధ్య అంతటి మైత్రీబంధం లేదు. ప్రతి సందర్భంలోనూ ఎవరికి వారే అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. మైత్రి ఉంటే.. పవన్ నిర్ణయ ప్రకటన వచ్చిన వెంటనే.. బీజేపీ నాయకులు కూడా.. అది తమ కూటమి నిర్ణయమే అని ఒక్కమాట చెప్పి ఉంటే సరిపోయేది. అలా జరగలేదంటే.. ప్రస్తుతానికి కమలదళం అభ్యర్థిని ఎన్నికల్లో దింపాలనేదే వారి వ్యూహంగా కనిపిస్తోంది.
విశ్లేషకులు అంచనా వేస్తున్న ప్రకారం.. బీజేపీ అభ్యర్థి పోటీకి దిగుతారు. పవన్ కల్యాణ్ ప్రత్యక్షంగా ప్రచారానికి రాకపోయినా.. ఆయనకు స్థానికంగా ఉండే పార్టీ దళాలు.. బీజేపీ అభ్యర్థి విజయం కోసం గట్టిగా పనిచేస్తాయి. అలాగే టీడీపీ ఎన్నికకు దూరంగా ఉంటోంది కానీ.. తమ పార్టీ శ్రేణులందరినీ లోపాయికారీగా బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా పని చేయాల్సిందిగా ప్రేరేపిస్తారు.
ఇవి కూడా చదవండి :
సినిమా ఇండస్ట్రీలో అరాచక విశృంఖలపోకడలపై సీనియర్ జర్నలిస్ట్ ‘రామ్’బాణం
వేదనలో సమంత.. లొకేషన్ లోనే కన్నీళ్లు పెట్టుకున్న వైనం
movie review : కంటతడి పెట్టించే సినిమా ‘రిపబ్లిక్’
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
రోజా సీటు కింద పెద్దిరెడ్డి కుంపటి రాజేస్తున్నారా
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
పవన్ కల్యాణ్ పై పోసాని ఆగ్రహం న్యాయమే
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
పవన్ కల్యాణ్ ఒంటరి అయిపోయాడా?
అవినీతి కేసుల్లో ఉన్న ఐఏఎస్ శ్రీలక్ష్మి .. తర్వాత ఎపీ సీఎస్ అవుతారా?
మూడు పార్టీలూ ఎంత లోపాయికారీగా పనిచేసినా.. బద్వేలులో వైఎస్సార్సీపీని ఓడించడం అసాధ్యం అనే క్లారిటీ ముగ్గురికీ ఉంది. కానీ.. తమ సమష్టి బలం ఎంత ఉంటుందో బేరీజు వేసుకోవడం వారి కోరిక. గత ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి ఓబుళాపురం రాజశేఖర్ కు 50 వేల ఓట్లు వచ్చాయి. పవన్ కల్యాణ్ పార్టీ ఇక్కడ బరిలోకి దిగలేదు. ఆ ఎన్నికల్లో జరిగిన ప్రహసనప్రాయమైన పొత్తుల్లో భాగంగా.. ఆయన ఈ సీటును బీఎస్పీకి కేటాయించారు. సుమారు 1300 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు లోపాయికారీగా మూడు పార్టీలూ కలిసి ఒకే అభ్యర్థి (బీజేపీ)ని బలపరిస్తే.. ఎన్ని ఓట్లు వ స్తాయో చెక్ చేసుకోవాలని అనుకుంటున్నారు.
తెలుగుదేశానికి సైకిలు గుర్తు ఉండదు గనుక.. ఆ నష్టం కొంత ఉంటుందని అనుకున్నప్పటికీ.. ఇప్పుడు ముగ్గురూ కలిసి గతంలో సైకిలుకు వచ్చిన 50 వేల ఓట్లకు దగ్గరగా వచ్చినా సరే.. అది వారికి ఘనవిజయమే. తమ ముగ్గురి పొత్తులకు విలువ ఉంటుందని.. కలిస్తే లాభం ఉంటుందని ఒక నిర్ణయానికి వస్తారు. రాబోయే రెండేళ్లలో ఈ ముగ్గురూ ఒకరిమీద ఒకరు విమర్శల డోసేజీ తగ్గించుకుంటూ.. సరిగ్గా ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన తరువాత.. జగన్ ను ఓడించే సామాజిక లక్ష్యం కోసం కలుస్తున్నట్లుగా ఒక నాటకీయ ప్రకటనతో కలిసి ఎన్నికల్లో పోటీచేస్తారు..అనేది ఒక అంచనా.
అయితే వీరికి ఆ మాత్రం ఆశ పుట్టించే వాతావరణం వస్తుందా అనేది అనుమానం. బీజేపీని బరిలోకి దించి.. లోపాయికారీగా టీడీపీ, జనసేన ఇద్దరూ మద్దతిచ్చినా.. ఎంత మేరకు అందుకుంటారనేది తెలీదు. 2014 లో పొత్తులు కలుపుకుని, ఆ తర్వాత.. ఒకరినొకరు మోసం చేశారని నిందలు వేసుకుని విడిపోయిన తర్వాత.. మళ్లీ కలిస్తే ప్రజలు ఛీత్కరిస్తారో సత్కరిస్తారో సూచనప్రాయంగా తెలుసుకోవడానికి మాత్రం ఈ బద్వేలు ఉప ఎన్నిక వారికి ఉపయోగపడుతుంది. అదికూడా.. బీజేపీ బరిలోకి దిగితే మాత్రమే. వారి నిర్ణయం ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
.