తెలుగు సాహిత్యానికి దిశానిర్ధేశం చేసిన మహాకవి శ్రీశ్రీ అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. కష్టజీవుల సాధక బాధకాలను తనలో తలచి మహాప్రస్థానం రాశారని తెలిపారు.
శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తకాన్ని జేబులో పట్టేలా భూమన ఆధ్వర్యంలో ప్రచురించగా… సాహితీ ప్రముఖులు వెల్చేరు నారాయణ రావు ఆవిష్కరించారు.
స్థానిక ఉదయీ ఇంటర్నేషనల్ హోటల్ లో మంగళవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీశ్రీ చిత్ర పటాన్ని, మహాప్రస్థానం పుస్తకాలను పల్లకీలో భూమన ఆధ్వర్యంలో ఊరేగింపు గా మోసుకొచ్చారు.
Also Read : ఈ రాశుల్లో పుడితే.. ప్రేమను బయటకు చెప్పలేరుట!
ఈ నేపథ్యంలో భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ సమాజాన్ని మార్చే శక్తి శ్రీశ్రీ కవిత్వానికి వుందన్నారు. అందరికీ దక్కాల్సిన సంపద కొంతమంది చేతుల్లోనే మిగిలిపోవడాన్ని శ్రీశ్రీ ప్రశ్నించారని తెలిపారు.
ప్రపంచం వ్యాప్తంగా 800 కోట్ల మంది ప్రజలు నివసిస్తుంటే.. వారందరి ఆస్తి కంటే, కేవలం 117 మంది వద్దే ఎందుచేత ఉండాలి అని ప్రశ్నించడం జరిగిందన్నారు. మహారాష్ట్ర లోని 10 లక్షల జనాభా నివసిస్తున్న ఓ మురికివాడ దుస్థితిని ఉటంకించారు. ఇక నైనా స్వార్ధ పూరిత ఆలోచనలను వీడాలని, నిస్వార్థంగా జీవించాలని భూమన పేర్కొన్నారు. సర్వేజన సుఖినోభవంతు అనుకుంటూ… సొంత లాభం కొంత మానుకుని, జీవించాలని కరుణాకర రెడ్డి అన్నారు.
Also Read : మంచితనం నిరూపించుకున్న వైసీపీ ఎమ్మెల్యే భూమన
జేబులో తుపాను పేరిట ప్రచురించిన శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తకాన్ని సాహితీ ప్రముఖులు వెల్చేరు నారాయణ రావు ఆవిష్కరించి మాట్లాడారు. జేబులో పట్టే సైజులో ప్రచురించి, అందరికీ అందిస్తున్న ఘనత భూమన కరుణాకర రెడ్డికే దక్కుతుందన్నారు. మొట్ట మొదట ప్రచురించిన శ్రీశ్రీ మహా ప్రస్థానం పుస్తకం కంటే.. జేబులో తుపాను పేరిట భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో ప్రచురించిన పుస్తకం చాలా గొప్పగా ఉందన్నారు.
ఈ కార్యక్రమానికి రాయలసీమ అధ్యయన సంస్థ కన్వీనర్ భూమన్ అధ్యక్షత వహించి మాట్లాడారు. శ్రీశ్రీ మహా ప్రస్థానాన్ని నేటి యువత కు జేబులో పట్టేలా కరుణాకర రెడ్డి ప్రచురించడం ప్రసంశనీయమన్నారు.
తిరుపతికి భూమన కరుణాకర రెడ్డి సాహితీ గుబాళింపు ను తీసుకొచ్చారని కొనియాడారు. ప్రముఖ కవి శివారెడ్డి మాట్లాడుతూ భూమన కృషిని ప్రశంసించారు. జేబులో తుపాను పుస్తకాన్ని యువత తమవెంట నిత్యం తమ వెంట తీసుకెళ్లాలని, స్ఫూర్తి పొందాలని ఆకాంక్షించారు.
.

Discussion about this post